అంతర్జాతీయం

ఇరాన్‌కు పెద్ద దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, నవంబర్ 3: అమెరికా విధించిన ఆంక్షలు నవంబర్ 5వ తేదీ నుంచి ఇరాన్‌ను భారీగా దెబ్బతీస్తాయని అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్‌లోని ‘దుష్ట ప్రభుత్వాని’కి వ్యతిరేకంగా ఇంత కఠినమయిన ఆంక్షలు ఇదివరకెప్పుడూ విధించలేదని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం ఎన్నికల ప్రచారానికి బయల్దేరడానికి ముందు ఆయన వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడుతూ, ఇరాన్ ఇప్పుడు సుమారు రెండేళ్ల క్రితంనాటి ఇరాన్ కాదని అన్నారు. ‘ఇరాన్ ఇప్పుడు ఎంతో భిన్నమయిన దేశం. అందుకే ఆ దేశంతో ఒప్పందాన్ని రద్దు చేశాను. అమెరికాకు ఇరాన్‌తో గతంలో ఉన్న అణు ఒప్పందం అత్యంత హాస్యాస్పదమయిన ఒప్పందం. అలాంటి ఒప్పందం ఏ దేశం, ఏ కాలంలోనూ కుదుర్చుకోలేదు’ అని ట్రంప్ అన్నారు. ‘అవి చాలా తీవ్రమయిన ఆంక్షలు. అవి చాలా పెద్ద ఆంక్షలు. అవి ఇంకా విస్తరిస్తాయి. ఇరాన్‌పై ఆంక్షలు మొదలయ్యాయనే మీకు తెలుసు. కాని, ఇరాన్ భీకర దాడిని ఎదుర్కొంటోంది’ అని ట్రంప్ అన్నారు. ఇరాన్‌తో అమెరికా గతంలో కుదుర్చుకున్న చరిత్రాత్మకమయిన ఒప్పందం జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ (జేసీపీఓఏ)ను ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తరువాత 2015 మేలో రద్దు చేశారు. ఆ ఒప్పందం విధ్వంసకరమయిందని ఆయన వ్యాఖ్యానించారు. బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన కాలంలో కుదిరిన ఈ ఒప్పందంలో ఐక్యరాజ్య సమితి (ఐరాస) భద్రతా మండలిలోని అయిదు శాశ్వత సభ్య దేశాలు, జర్మనీ కూడా ఉన్నాయి. ఈ ఒప్పందం ప్రకారం, ఇరాన్ తనపై ఆర్థిక ఆంక్షలను తొలగించినందుకు ప్రతిగా అణు కార్యక్రమాన్ని నిలిపివేసింది. అమెరికా ఈ ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేసుకున్న తరువాత ట్రంప్ ఇరాన్‌పై తాజా ఆంక్షలను విధించారు. ఇరాన్ వివాదాస్పద అణ్వస్త్ర కార్యక్రమాన్ని కొనసాగిస్తోందని ఆరోపిస్తూ, ఆ దేశానికి ఎవరూ సహకరించవద్దని ఇతర దేశాలను ట్రంప్ హెచ్చరించారు. అయితే ట్రంప్ చేసిన ఈ ఆరోపణలను ఇరాన్ ఖండించింది. తన అణు కార్యక్రమం శాంతియుత ప్రయోజనాలకు సంబంధించిందేనని ఇరాన్ పేర్కొంది. ‘్భయంకరమయిన ఒప్పందం ప్రకారం తొలగించిన ఆంక్షలను మేము ఈ రోజే తిరిగి విధించాము. మేము ఇరాన్‌లోని దుర్మార్గమయిన ప్రభుత్వంపై గతంలో ఎన్నడూ విధించనంతటి కఠినమయిన ఆంక్షలు విధించాము’ అని ట్రంప్ వెస్ట్ వర్జీనియాలో నిర్వహించిన ఒక ఎన్నికల సభలో తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ అన్నారు. అంతకు ముందు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పోంపియో ‘సీన్ హ్యానిటీ షో’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజ్యమే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాలలో ప్రపంచంలోనే అతి పెద్ద దేశం ఇరాన్ అని ఆరోపించారు.