అంతర్జాతీయం

మానవ హక్కులకు దిక్కేదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్యసమితి, నవంబర్ 3: మానవ హక్కుల అంశాలు రాజకీయంగా మారాయని, ఇది మంచి పరిణామం కాదని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఐరాస మానవ హక్కుల మండలి పనితీరు సంక్లిష్టంగా మారిందని భారత్ పేర్కొంది. విదేశాంగ విధానంలో మానవ హక్కులను రాజకీయ కోణంగా చూడడం సరికాదని భారత్ ఉప శాశ్వత ప్రతినిధి తన్మయ లాల్ అన్నారు. మానవ హక్కుల మండలి ఎన్నో తీర్మానాలు చేస్తోందన్నారు. ఈ నిర్ణయాలు అమలుకు నోచుకోవడం లేదన్నారు. మానవ హక్కుల మండలి నివేదిక సమావేశంలో ఆయన పై అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా మానవ హక్కుల అంశం సవాలుగా మారిందన్నారు. అంతర్జాతీయంగా సుపరిపాలన యంత్రాంగాలు అనేక సంక్లిష్ట సమస్యలను ఎదుర్కొంటున్నాయన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాలు కనుగొనడంలో మానవ హక్కుల మండలి విఫలమవుతోందన్నారు. ప్రతి దేశంలో వ్యవస్థలకు, వ్యక్తులకు, జాతీయ సార్వభౌమత్వం, అంతర్జాతీయ మార్గదర్వకాలకు, సాంస్కృతికపరమైన వైరుధ్యాల మధ్య సంఘర్షణలు తలెత్తుతున్నాయన్నారు. మానవ హక్కుల అంశంలో రాజకీయాలు చోటు చేసుకున్నయని, ఇది ఆందోళన కలిగించే పరిణామమన్నారు. మానవ హక్కుల మండలి ఈ హక్కుల ప్రాధాన్యతను, ఆవశ్యకతను నొక్కి వక్కాణిస్తూ చేసే తీర్మానాలు, నిర్ణయాలు, వెలువరించే నివేదికల వల్ల ఏ మాత్రం ప్రయోజనం చేకూరుతుందో విశే్లషించుకోవాల్సిన అవసరం ఆసన్నమైందన్నారు. ఈ ధోరణి వల్ల అంతర్జాతీయంగా ఐక్యరాజ్యసమితి విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారుతోందన్నారు. మానవ హక్కుల్లో సాంస్కృతిక, వ్యక్తిగత, పౌర, రాజకీయ, సామాజిక, ఆర్థిక హక్కులకు భంగం కలిగే అంశాలున్నాయన్నారు. దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించే విధంగా ఏ దేశం కూడా ఊరికే ఉండదన్నారు. ఉగ్రవాదం అత్యంత అమానుషమైదని, మానవ హక్కులకు భంగం కలిగించే అత్యంత ప్రమాదభరితమైన సంస్థలు పుట్టుకొస్తున్నాయన్నారు. ఉగ్రవాదుల వల్ల అమాయకులు బలవుతున్నారన్నారు. ఉగ్రవాదులు సరిహద్దుల దాటి ఇతర దేశాల్లో అలజడి, హింసను సృష్టిస్తున్నారని, మారణ హోమాలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. ఉగ్రవాదం అంతర్జాతీయంగా మానవ హక్కులకు భంగం కలిగిస్తున్నా, దీని నిర్మూలనకు నిర్దిష్టమైన చర్యలు తీసుకోవడంపై దృష్టి సారించాలన్నారు.