అంతర్జాతీయం

భారత సంస్కృతిలో యోగా భాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హరారే, నవంబర్ 4: భారతదేశం సంస్కృతి, ప్రాచీన నాగరికతలో యోగా భాగమని ఉపరాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. ఆయన ఆదివారం ఇక్కడ ఇండియన్ ఎంబసీ నూతన భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇందులో యోగా సెంటర్‌ను నిర్మిస్తారు. ఆఫ్రికాఖండంలో మూడు దేశాల పర్యటనలో భాగంగా ఆయన ఇక్కడకు శుక్రవారం చేరుకున్నారు. బోత్స్వానా, జింబాబ్వే, మాల్వాయి దేశాలతో భారత్‌కు ద్వైపాక్షికి సంబంధాలను అభివృద్ధి చేసేందుకు ఉపరాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు పర్యటన దోహనపడిందని విదేశాంగ మంత్రిత్వశాఖ పేర్కొంది. అశోక చక్రంను పోలిన విధంగా ఆర్కిటెక్చర్‌తో నిర్మిస్తారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రావీష్ కుమార్ పేర్కొన్నారు. భారత్, జింబాబ్వే దేశాల మధ్య సంబంధాలు అభివృద్ధికి ఈ భవన నిర్మాణం కేంద్రంగా భాసిల్లుతుంది. ఈ కార్యక్రమంలో జింబాబ్వేలో భారత్ రాయబారి ఆర్ మస్కుల్, సిబ్బంది పాల్గొన్నారు. 17.8 ఎకరాల్లో ఈ భవనాలను నిర్మిస్తారు. జింబాబ్వే అధ్యక్షుడు ఎమర్సెన్ నాన్‌గగావా, మంత్రి కెంబో మెహదీ తదితరులతో ఉపరాష్టప్రతి వెంకయ్యనాయుడు చర్చలు జరిపారు. సోమవారం ఆయన మాల్వాయి దేశాన్ని సందర్శించి ఢిల్లీకి బయలుదేరివెళుతారు. జింబాబ్వేలో గుజరాత్‌కు చెందిన 9 మంది వేల మంది స్ధిరపడ్డారు.