అంతర్జాతీయం

చైనా అణచివేతకు నిరసనగా ఒకరి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, నవంబర్ 9: చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా టిబెట్‌లో బౌద్ధమతస్తుడొకరు ఆత్మాహుతికి పాల్పడ్డాడు. టిబెట్ విముక్తి ప్రచారకర్త డోర్బే(23) శనివారం శరీరానికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. టిబెట్‌కి చెందిన సిఛౌన్‌లోని నగాబాలో ఆదివారం ఈ విషాదం చోటుచేసుకుంది. దలైలామా వర్ధిల్లాలంటూ డోర్బే నిప్పంటించుకున్నాడని మీడియావర్గాల కథనం. 2009 నుంచి బౌద్ధులు ఆత్మాహుతికి పాల్పడుతూ చైనా ప్రభుత్వానికి తమ నిరసన తెలుపుతునే ఉన్నారు. ఒక్క డోర్బేనే కాదు అనేక మంది ఉద్యమానికి బలైపోతున్నారు. టిబెట్ తమ దేశంలో అంతర్భాగమని చైనా శతాబ్దాలుగా వాదిస్తూ వస్తోంది. టిబెటిన్లు మాత్రం తమకు విముక్తి కల్పించాలని అంతర్జాతీయ వేదికలపైనే గళం విప్పుతునే ఉన్నారు. చైనా ప్రభుత్వ అణచివేతకు నిరసనగా బౌద్ధుల మత గురువుదలైలామా 1959లో దేశం విడిచి వెళ్లిపోయారు. తమ సంస్కృతి, సంప్రదాయాలను చైనా కమ్యూనిస్టు పార్టీ అణచివేస్తోందంటూ బౌద్ధ సన్యాసులు, సన్యాసినులు, ప్రజలు ఆత్మాహుతికి పాల్పడుతునే ఉన్నారు. అలాగే దలైలామా తిరిగిరావాలని కోరుకుంటునే ఉన్నారు. చైనాకు వ్యతిరేకంగా ఆత్మాహుతులు పెరిగిపోతున్నప్పటికీ ప్రభుత్వ వర్గాలు మాత్రం కొట్టిపారేస్తున్నాయి. అలాంటి సంఘటనలేవీ తమ దృష్టికి రాలేదని చెబుతున్నాయి.