అంతర్జాతీయం

మీ చేతిలోనే బ్రాండ్ ఇండియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షిల్లాంగ్, ఏప్రిల్ 16: భారత దేశ కీర్తిప్రతిష్టలకు ప్రతీకలుగా నిలిచే సంస్థలు నీతి నిజాయితీలకు, నైతికవర్తనకు పట్టంగట్టాలని ఉప రాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన వరుస బ్యాంకు కుంభకోణాల వల్ల భారతదేశ ప్రతిష్టకు తీవ్రంగా భంగం కలిగిందని పేర్కొన్న ఆయన, బ్రాండ్ ఇండియా నాయకులు నైతిక విలువలకు పట్టంగట్టినప్పుడే దేశ పరువు నిలబడుతుందని, ప్రతిష్ట ఇనుమడిస్తుందని స్పష్టం చేశారు. నీతి నిజాయితీ నైతిక విలువల విషయంలో రాజీపడిన లక్షణాలను బ్రాండ్ ఇండియా నాయకులు కనబర్చినప్పుడే ఈ లక్ష్య సాధన సాధ్యమవుతుందని వెంకయ్య వెల్లడించారు. చట్టంపట్ల ఎలాంటి భయం లేకపోవడం వల్ల ఇటీవలి కాలంలో కొందరు వ్యక్తుల చర్యలు కారణంగా భారీ కుంభకోణాలు తలెత్తాయని ఆయన అన్నారు. ఐఐఎం షిల్లాంగ్ స్నాతకోత్సవం సందర్భంగా సోమవారం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన ఉప రాష్టప్రతి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా రుజువర్తనను వీడకూడదని, నిజాయితీకి నైతిక వర్తనకు కట్టుబడుతూనే ముందుకు సాగాలని ఉద్ఘాటించారు. అలాగే కుంభకోణాలకు తావులేని రీతిలో ఉత్తమమైన విధానాలను అనుసరించటం వల్ల కూడా వ్యవస్థలను సజావుగా నిర్వహించడం సాధ్యమవుతుందని వెంకయ్య తెలిపారు. ముఖ్యంగా కార్పొరేట్ నీతి నియమాలను ఎట్టిపరిస్థితుల్లో ఉల్లంఘించడానికి వీలు లేదని స్పష్టం చేసిన ఆయన ‘మీరంతా భావి భారత పౌరులు. దేశ కీర్తి ప్రతిష్టలను, నైతిక ధర్మాన్ని పాటించి విలువలను ఇనుమడింప చేయాల్సిన కర్తవ్యం మీపై ఉంది. భారత్ గర్వించే విధంగా నైతిక ప్రమాణాలను అడుగడుగునా కనబర్చాలి’ అంటూ విద్యార్థులకు ఉద్భోదించారు. రానున్న కొనే్నళ్లలో భారత యువతకు అపారంగా అవకాశాలు అందిరాబోతున్నాయంటూ ఆసియా అభివృద్ధి బ్యాంకు చేసిన సర్వే వివరాలను ఉటంకించిన వెంకయ్య, ఈ అవకాశాలు అందిరావాలంటే యువతీ యువకులు నైతిక వర్తనకు కట్టుబడి ఉండాలని, బ్రాండ్ ఇండియా సారథులుగా దేశం గర్వించేలా విధులను నిర్వహించాలన్నారు. ఎన్డీయే ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన పన్నుల విధానాన్ని శ్లాఘించిన ఆయన, దీనివల్ల భారత్ వృద్ధిరేటు మరింతగా పరుగులు పెడుతుందని, అలాగే వ్యాపారానుకూల పరిస్థితులను బలంగా పాదుకొల్పడం వల్ల విదేశీ పెట్టుబడులు తరలివచ్చే అవకాశం ఉందని వెంకయ్య తెలిపారు. ముఖ్యంగా వ్యాపార నిర్వహణకు సంబంధించిన విధి విధానాలను సరళతరం చేయడం వల్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విస్తృతి పెరిగిందన్నారు. భారత దేశాన్ని అంతర్జాతీయ ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దే బాధ్యతను ఈ మేనేజిమెంట్ గ్రాడ్యుయేట్లు భుజానికెత్తుకోవాలని, సగర్వంగా తమ బాధ్యతలు నిర్వర్తించాలన్నారు. అంతర్జాతీయంగా భారత బ్రాండ్ రాణించాలంటే అందుకు వౌలికంగా కొన్ని అంశాలను పాటించాలని, వస్తు నాణ్యత, వేగవంతమైన, సమర్థవంతమైన సేవలు నైతిక విలువలు తప్పని వ్యాపార విధానాల వల్లే భారత ఆర్థిక ఉన్నతి సాధ్యమవుతుందని ఆయన అన్నారు.