అంతర్జాతీయం

హెచ్-1బీ వీసాల జారీకి కొర్రీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* హెచ్-4 వీసాల్లో మార్పులు తెస్తాం
* ఉదారంగా వ్యవహరిస్తాం: ట్రంప్ ప్రభుత్వం
వాషింగ్టన్, నవంబర్ 9: హెచ్ 1బీ వీసాలను చట్టవిరుద్ధంగా, మార్గదర్శకాలను పక్కనపెట్టి నిలిపివేసే విధానాలకు అమెరికా ఇమ్మిగ్రేషన్ ఏజన్సీ పాల్పడుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గూగుల్, ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఉద్యోగుల హెచ్ 1బీ వీసాలను పెద్ద ఎత్తున అమెరికా ఏజన్సీ నిలిపివేసింది. ఈ వీసాల సంఖ్య బాగా పెరిగింది. భారత ఐటి కంపెనీలు, వృత్తి నిపుణుల్లో హెచ్1బీ వీసాలు కలిగిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ వీసాలకు మంచి డిమాండ్ ఉంది. ఈ వీసా కింద ఉద్యోగులు అమెరికా కంపెనీల్లో పనిచేయవచ్చు. ప్రత్యేక నిపుణులకు ఈ వీసాను మంజూరు చేస్తారు. ఇండియా, చైనా నుంచి లక్షలాది మంది ఉద్యోగులను హెచ్ 1బీ వీసా కింద ప్రముఖ కంపెనీలు అమెరికాకు తీసుకెళుతుంటాయి. ఇటీవల కాలంలో రకరకాలుగా కొర్రీలు వేసి హెచ్-1వీసాలను నిలిపివేస్తున్నారని ప్రముఖ సంస్థలు పేర్కొన్నాయి. హెచ్-1బీ వీసాపై మార్పులు తేవడంపై కంపీట్ అమెరికా సంస్థ సెక్రటరీ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ కిర్స్‌జెన్ నెల్సన్‌కు, అమెరికా సిటిజన్‌షిప్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ డైరెక్టర్‌గా లేఖ రాసింది. ఇమ్మిగ్రేషన్ ఏజన్సీ అనుసరిస్తున్న విధానాలు పారదర్శకంగా లేవన్నారు. చట్టాలకు విరుద్ధంగా ఏజన్సీ నడుచుకుంటోందన్నారు. ఇటీవల కాలంలో హెచ్-1బీసీ వీసా పిటిషన్లపై నోటీస్ ఆఫ్ ఇంటెంట్ టు డినై, నోటీస్ ఆఫ్ ఇంటెంట్ టు రివోక్‌ను జారీ చేస్తున్నారు. అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ చేసిన వారికి మాత్రం మినహాయింపు ఇస్తున్నారు. హెచ్-1బీ వీసాను మూడేళ్ల కాలపరిమితికి ఇస్తారు. కాని ఆరేళ్లకు మించి అనుమతించరు. 1991 నుంచి హెచ్ 1 బీ వీసా అమలులో ఉంది. అమెరికాలో పనిచేస్తున్న వారి జీవిత భాగస్వాములకు హెచ్-4 వీసాలను పునరుద్ధరించే విషయమై చట్టబద్ధంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని ట్రంప్ ప్రభుత్వం పేర్కొంది. ఈ విషయమై త్వరలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. అమెరికాలో పనిచేసే విదేశీ నిపుణుల జీవిత భాగస్వాములకు హెచ్ 4 వీసాలను మంజూరు చేస్తారు. ఈ వీసా కోసం లక్షలాది మంది భారతీయ ఉద్యోగుల జీవిత భాగస్వాములు ఎదురుచూస్తున్నారు. ఇండియా నుంచి వెళ్లిన ఐటి ఉద్యోగులు ఈ వీసా కోసం చాలా సమస్యలు ఎదుర్కొంటారు. డిపార్టుమెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ వచ్చే జనవరిలో కొత్త మార్గదర్శకాలను విడుదల చేయనుంది. ఈ మార్గదర్శకాలు అమలైతే 70 వేల మంది జీవిత భాగస్వాములకు మేలు చేకూరుతుంది. హెచ్-4 వీసాలు ఇప్పటికే ఉన్న వారిలో మంచి నిపుణులు ఉన్నారు. వీరి వల్ల కంపెనీల కార్యకలాపాలకు చాలా ఉపయోగం ఉంటోంది.