అంతర్జాతీయం

మానవ హక్కులు కాపాడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగపూర్, నవంబర్ 14: మైన్మార్ అధ్యక్షురాలు అంగ్ సాన్ సూకీ దేశంలో రోహింగ్యా ముస్లింలకు రక్షణ కల్పించడంలో విఫలమయ్యారని, ఈ విషయంలో ఆమె శ్రద్ధ వహించి మానవ హక్కులను కాపాడాలని అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ కోరారు. సింగపూర్‌లో ఆగ్నేయాసియా దేశాల శిఖరాగ్ర సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ఆగ్నేయాసియా దేశాల అధినేతలు, అమెరికా ఉపాధ్యక్షుడు హాజరయ్యారు. మియాన్మార్ నుంచి దాదాపు ఏడు లక్షల మంది రోహింగ్యా ముస్లింలను బౌద్ధులు తరిమిగొట్టారు. దీంతో వారు బంగ్లాదేశ్ తదితర దేశాల్లో తలదాచుకుంటున్నారు. ఆమ్మెస్టీ ఇంటర్నేషనల్ కూడా ఒకప్పటి మానవ హక్కుల నేత, ప్రస్తుతం మియాన్మార్ అధినేత సూకీ తీరును విమర్శించింది. ఈ సమావేశంలో పాల్గొన్న అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ మాట్లాడుతూ రోహింగ్యా ముస్లింలను దేశం నుంచి తరిమిగొట్టడం అమానుషమన్నారు. ఈ వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయ్నారు. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. కాగా రోహింగ్యా ముస్లింలపై సైన్యం గత ఏడాది నుంచి విరుచుకుపడుతోంది. వీరిపై అత్యాచారాలు, హత్యలకు పాల్పడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఐరాస కూడా ఈ ఘటనలపై ఆందోళన వ్యక్తం చేసింది. వీరిని మాతృదేశానికి తీసుకురావాల్సిన బాధ్యత మియాన్మార్ ప్రభుత్వంపై ఉందన్నారు. సూకీ కూడా మియాన్మార్‌లో సైన్యం నియంతృత్వం నుంచి దేశాన్ని రక్షించేందుకు పోరాడారు. దీంతో అమెకు నోబెల్ బహుమతి లభించింది. కాగా మియాన్మార్ ప్రభుత్వంలో సూకీ కీలక పాత్ర పోషిస్తున్నారు. కాని ఆర్మీపై ప్రభుత్వానికి నియంత్రణ లేదు. అన్ని రకాల భద్రత వ్యవహారాలపై మిలిటరీకే పెత్తనం ఉంటుంది. రోహింగ్యాలను ఆదుకునేందుకు సూకీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. వారి హక్కుల సంరక్షణకు కూడా ఏమీ మాట్లాడడం లేదు. పది మంది రోహింగ్యా ముస్లింల హత్య వార్తను ప్రసారం చేసినందుకు రాయిటర్స్‌కు చెందిన ఇద్దరు ప్రతినిధులకు కూడా కోర్టులు జైలు శిక్షను విధించాయి. అధికార రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించినందుకు కోర్టులు జైలు శిక్షను విధించాయని సూకీ పేర్కొన్నారు. నిందితులపై వచ్చిన అభియోగాలను కొట్టివేసే హక్కు సూకీ ప్రభుత్వానికి ఉంది. కాని ఆ అధికారాన్ని సూకీ ఉపయోగించలేదు.