అంతర్జాతీయం

మరింత సన్నిహితమవుదాం....

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగపూర్, నవంబర్ 15: శాంతి, సౌభాగ్యాలతో కూడిన ఇండోపసిఫిక్ ప్రాంతాన్ని తీర్చిదిద్దడానికి భారత్ కట్టుబడి ఉందని భారత ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు.
గురువారం ఇక్కడ జరిగిన 13వ ఆసియా శిఖరాగ్ర సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్థిక, సాంస్కృతిక, ఇతర రంగాల్లో సభ్యదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సమ్మిట్‌లో ఐదోసారి పాల్గొన్న ఆయన మాట్లాడుతూ 2005 నుంచి జరుగుతున్న ఈ సమావేశాలకు భారత్ దేశం క్రమం తప్పకుండా హాజరవుతోందని గుర్తు చేస్తూ సభ్యదేశాల మధ్య వివిధ అంశాల్లో బలపడాల్సిన సంబంధాల గురించి తాను గుర్తు చేయదల్చుకున్నానని చెప్పారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత్ ఎప్పుడూ శాంతిని కోరుకుంటోందని ఆయన పునరుద్ఘాటించారు.
అలాగే సముద్ర సంబంధ విషయాలలో చేసుకున్న రీజినల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్టనర్ షిప్ (ఆర్‌సీఈపీ)కి తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని వివిధ దేశాలకు చెందిన నేతలతో సమావేశమయ్యారు. అనంతరం సమ్మిట్ లీడర్లతో కలిసి గ్రూప్ ఫొటో దిగారు. తొలుత ఆసియన్ నేతలతో సమావేశమైన ఆయన ఆసియన్ దేశాల మధ్య సంబంధాలు పటిష్టంగా ఉన్నాయని అన్నారు. అదేవిధగా కేడెట్ ఎక్స్‌ఛేంజ్ కార్యక్రమం కింద సింగపూర్‌ను సందర్శించిన ఎన్‌సిసి కేడెట్ అభ్యర్థులను ఆయన కలిసారు. ‘ఈ యువ మిత్రులతో కొంతసేపు గడపటం మరచిపోలేనిది. వారు తమ అనుభవాలు, మరచ్చిపోలేని సంఘటనలు నాతో పంచుకున్నారు’ అని ఈ సందర్భంగా మోదీ ట్వీట్ చేశారు. రెండు రోజుల సింగపూర్ పర్యటనలో భాగంగా బుధవారం ఇక్కడకు చేరుకున్న ఆయన మొదటిరోజు ప్రతిష్టాత్మకమైన ఫిన్ ఫెస్టివల్‌లో ప్రసంగించారు. అలాగే ఆయన అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పీన్స్, సింగపూర్ నేతలతో సమావేశమై ద్వైపాక్షిక విషయాలు చర్చించారు..రక్షణ, వాణిజ్యం, భద్రత తదితర రంగాల్లో తమ సంబంధాలను మరింత పటిష్టం చేసుకునే విషయమై ఆయన ఆస్ట్రేలియా, సింగపూర్, థాయిలాండ్ దేశాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. తాను ఆసియన్-ఇండియా, ఈస్ట్ ఇండియా సమ్మిట్‌లలో పాల్గొనడం ఆయా సభ్యదేశాల పట్ల భారత్‌కు ఉన్న నిబద్ధత వైఖరిని తెలియజేస్తోందని ఈ సందర్భంగా మోదీ ట్వీట్ చేశారు.