అంతర్జాతీయం

యూఏఈలో రవిశంకర్ ధ్యానానికి అనూహ్య స్పందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్యూజైర సిటీ (యూఏఈ): ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీ రవిశంకర్ మొదటిసారిగా ఇక్కడ ఏర్పాటు చేసిన సామూహిక ధ్యాన కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. ప్రపంచశాంతి ప్రచారంలో భాగంగా ఇక్కడి ఫుట్‌బాల్ స్టేడియంలో మహిళలు, పిల్లలు సహా అన్ని వర్గాల వారు పెద్దయెత్తున పాల్గొన్నారు. 10,645 సీట్ల కెపాసిటీ ఉన్న ఈ స్టేడియం గురువారం సాయంత్రం ఈ ధ్యాన కార్యక్రమానికి వచ్చిన వారితో నిండిపోయింది. ఈ సందర్భంగా మనం సమాజంలో సంతోషంగా ఎలా జీవించాలి, ఒత్తిడి, ఉద్రిక్త పరిస్థితులు సమాజంలో ఎలాంటి అశాంతి పరిస్థితులు సృష్టిస్తున్నాయి, అలాంటి సమాజం నుంచి మనం ఎలా బయటడాలి తదితర అంశాలను రవిశంకర్ చక్కగా విడమర్చి చెప్పారు. ఈ సందర్భంగా ప్రపంచ శాంతిని ఆకాంక్షిస్తూ ఆహూతులతో శాంతి మంత్రాన్ని పఠింపజేశారు. ఫ్యూజిరా ఆహ్వానం మేరకు నాలుగు రోజుల పర్యటన నిమిత్తం గురువారం ఇక్కడకు చేరిన రవిశంకర్ ప్రపంచవ్యాప్తంగా పడగవిప్పుతున్న ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తూ సమాజంలో శాంతి నెలకొల్పడానికి ఎంతో కృషి చేస్తున్నారని ఫ్యుజిరా అధ్యయుడు మహమ్మద్ ఆల్ షార్కి ప్రశంసించారు. రవిశంకర్ స్థానిపించి ఆర్ట్ ఆప్ లివింగ్ (ఏఓఎల్) ప్రపంచ శాంతికి ఎంతో కృషి చేస్తోందని, ఇది ఎందరో జీవితాల్లో సంతోషాన్ని నింపుతోందని ఆయన అన్నారు. అరబ్ దేశాల్లో సైతం తన ప్రవచనాల ద్వారా శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నిస్తున్న రవిశంకర్‌కు తమ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఆయన హామీనిచ్చారు. అరబ్ దేశాలు పలు సమస్యలతో సతమతమవుతున్నాయని, కోట్లాది మంది ఇబ్బందుల్లో ఉన్నారని, అరబ్ ప్రపంచంలో సైతం ఆయన ప్రవచనాల ద్వారా శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరియాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఫ్యుజిరా యువరాజు షేక్ మహమ్మద్ బీన్ హమాద్ ఏఓఎల్ కార్యక్రమాలను ప్రస్తుతిస్తూ రవిశంకర్‌ను ప్రేమగురుగా అభివర్ణించారు. అంతకుముందు రవిశంకర్, ఆయన బృందానికి రాజకుటుంబం ఘనంగా స్వాగతం పలికింది.