అంతర్జాతీయం

* హెచ్-4 వీసాలను రద్దు చేయొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, నవంబర్ 17: అమెరికాలో హెచ్ 1 బీ వీసాలపై పనిచేసే ఉద్యోగుల జీవిత భాగస్వాములు పనిచేసేందుకు వీలు కల్పించే హెచ్-4 వీసాలను రద్దు చేయాలన్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ అమెరికా కాంగ్రెస్‌లో బిల్లును ప్రవేశపెట్టారు. ఇద్దరు సభ్యులు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. దీని వల్ల చాలా మంది విదేశీ ఉద్యోగుల జీవితభాగస్వాముల ఏవలను వినియోగించుకోలేకపోతామని వాలు చెప్పారు. హెచ్-1 బీ వీసా విదేశీ ఉద్యోగులకు ఇస్తారు. వీరి జీవిత భాగస్వాములకు హెచ్-4 వీసాలను ఇస్తారు. ఈ వీసా కింద అనేక మంది భారతీయులు, ఇతర దేశాల వారు అమెరికా సంస్థల్లో పనిచేస్తున్నారు. హెచ్-1బీ వీసా తర్వాత హెచ్-4 వీసాకు విపరీతమైన డిమాండ్ ఉంది. అమెరికా ఐటి కంపెనీల్లో పెద్ద సంఖ్యలో హెచ్ 1బీ వీసాలపై పనిచేసే భారతీయులు పనిచేస్తున్నారు. అన్నా జీ ఈషో, జోరుూ లోఫ్‌గ్రీన్‌లు హెచ్-4 ఉద్యోగ రక్షణ చట్టం కింద బిల్లును ప్రవేశపెట్టారు. ఒబామా ప్రభుత్వం గతంలో హెచ్-4 వీసాలను జారీ చేసింది. ఈ విధానం వచ్చిన తర్వాత ఒక లక్ష మంది ఉద్యోగులు హెచ్-4 వీసా కింద అమెరికాలో పనిచేస్తున్నారు. ఇందులో భారతీయులు ఎక్కువగా ఉన్నారు. ఈ వీసాలను రద్దు చేస్తే కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమవుతుందన్నారు. హెచ్-4 వీసాలను రద్దు చేయడం వల్ల ఉద్యోగ విధానాల్లో పారదర్శకత లోపిస్తుందన్నారు. ఈ వీసాలను రద్దు చేయాలని ట్రంప్ ప్రభుత్వం యోచిస్తోంది. కాని ఏ విధంగానైనా హెచ్-4 వీసాలు రద్దు కాకుండా చూడాలని అమెరికా కాంగ్రెస్‌లో తమకు మద్దతు ఇచ్చే వారి సంఖ్య పెరుగుతుందని వారు చెప్పారు.