అంతర్జాతీయం

అమెరికాతో సంబంధాలు క్షీణించాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెయింట్ పీటర్స్‌బర్గ్, మే 26: అమెరికాతో సంబంధాలు క్రమేపి దెబ్బతినడం పట్ల రష్యా అధ్యక్షుడు వ్లాదమీర్ పుతిన్ విచారం వ్యక్తం చేశారు. అమెరికాతో మె రుగైన సంబంధాలు ఉండాలని మొదటి నుంచి రష్యా కోరుకుంటోందని, కాని దురదృష్టవశాత్తు అమెరికా తనకు తాను సృష్టించుకున్న వివాదాల్లో చిక్కుకుందని ఆయన వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ న్యూస్ ఏజన్సీల ఎడిటర్స్ సమావేశంలో పుతిన్ పై వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ ఎన్నికైన వెంటనే సంబంధాలు మెరుగవుతాయని ఆశలు పెట్టుకున్నామన్నారు. కాని అవన్నీ తలకిందులయ్యాయన్నారు. ట్రంప్ అధ్యక్షుడైన త ర్వాత అమెరికా ప్రభుత్వం రష్యాపై ఆంక్షలు విధించిందని, రాయబారులను దేశం నుంచి బహిష్కరించిందని చెప్పారు. ఇరాన్‌తో ఖరారైన అణు ఒప్పందం నుంచి వైదొలగాలని అమెరికా తీసుకున్న నిర్ణయం వల్ల ఉద్రిక్తతలు పెరుగుతాయన్నారు. యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని నిలుపుదల చేయాలని ట్రంప్ ప్రభుత్వం కోరుతోందన్నారు. అంతర్జాతీయ ఒప్పందాలను ప్రతి నాలుగేళ్లకోసారి మార్చితే, విలువ ఏముంటుందని ఆయ ప్రశ్నించారు. ఒప్పందాలకు కట్టుబడి ఉండకుండా, తరచుగా వాటిని మార్చితే, విశ్వాసం కోల్పోతామన్నారు. ఉత్తర కొరియా అధినేత కిమ్ జాన్‌తో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్చలు నిర్వహిస్తారన్న అంశంపై స్పందిస్తూ, ఈ విషయమై తాను మాట్లాడనన్నారు. ఉత్తర కొరియా లాంటిదేశాలతో చర్చల్లో కఠిన వైఖరిని అవలంభించడం సరికాదన్నారు. ఉత్తర కొరియా పూర్తిగా నిరాయుధీకరణ పాటించాలంటే, అణ్వాయుధాలు త్యజించిన తర్వాత ఆ దేశ సార్వభౌమాధికారానికి ముప్పు ఉండదనే హామీ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ట్రంప్‌తో సంబంధాలు క్షీణించడం పట్ల ఆయన అసహనాన్ని వ్యక్తం చేశారు. అమెరికా అంతరంగిక గొడవల వల్ల రష్యా బంధీ అయినట్లు ఆయన అన్నారు. తమ దేశం పట్ల ఉన్న అపోహలు తొలగిపోయి, రెండు దేశాల మధ్య త్వరలోనే సత్సంబంధాలు నెలకొంటాయని ఆశిస్తున్నట్లు పుతిన్ చెప్పారు. ఇరాన్ అణు ఒప్పందం విషయంలో అమెరికా మొండి వైఖరి విడనాడకపోతే, అమెరికా-ఐరోపా దేశాలల మధ్య సంబంధాలపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. ఇదే జరిగితే ఐరోపా భద్రతకు రష్యా ముందుంటుందన్నారు. కాగా ఇక్కడ జరిగిన ఎకనామిక్ ఫోరం సమావేశంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో పాటు ఫ్రెంచి అధ్యక్షుడు ఎమాన్యుయేల్ మాక్రన్, జపాన్ ప్రధాన మంత్రి షింజో ఆబే పాల్గొన్నారు.