అంతర్జాతీయం

భారత్‌కు అపాచి, మిసైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 13: భారత్‌కు అపాచి యుద్ధ హెలికాప్టర్లు , మిసైళ్లను విక్రయించే ఒప్పందానికి ట్రంప్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ వివరాలను పెంటగాన్ ప్రకటనలో పేర్కొంది. ఆరు ఏహెచ్-64ఇ అపాచీ హెలికాప్టర్లు, హెలిఫైర్, మిసైళ్లను భారత్ కొనుగోలు చేయనుంది. వచ్చే నెలలో భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ , రక్షణ శాఖ మంత్రి నిర్మల సీతారామన్ అమెరికాకు రానున్నారు. ఈ సందర్భంగా వారు అమెరికా రక్షణ నిపుణులతో చర్చలు జరపనున్నారు. అమెరికా తరఫున మైక్ పాంపియో, జేమ్స్ మాటిస్ పాల్గొంటారు. అమెరికా కాంగ్రెస్ నుంచి వ్యతిరేకత వ్యక్తం కాని పక్షంలో యుద్ధ హెలికాప్టర్ విక్రయాల వ్యవహారం జాప్యం కాకుండా సాఫీగా జరుగుతుంది. ఏహెచ్-64 అపాచి హెలికాప్టర్‌ను అమెరికాతో పాటు ప్రపంచంలో పలు దేశాలు వినియోగిస్తున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం కంట్రోల్ రాడార్లు, హెలిఫైర్ లాంగ్‌బో మిసైళ్లు, స్టింగర్ బ్లాక్ 1-92హెచ్ మసైళ్లు, సెన్సార్లు, నావిగేషన్ సిస్టమ్స్ ఉన్నాయి. వీటి దిగుమతి వల్ల భారత్ రక్షణ వ్యవస్ధ బలపడుతుందని అమెరికా రక్షణ నిపుణులు భావిస్తున్నారు. యుద్ధ హెలికాప్టర్ల విక్రయంపై త్వరలో అమెరికా ప్రకటన చేయనుంది. అత్యంత ఆధునికమైన హెలికాప్టర్లను యుఎస్ ఆర్మ్స్, ఏవియేషన్స్, జనరల్ ఎలక్ట్రిక్, రేథియాన్ సంస్థలు తయారు చేస్తున్నాయి. 2008 నుంచి నేటి వరకు 15 బిలియన్ డాలర్ల విలువైన రక్షణ రంగ ఆయుధాలను అమెరికా భారత్‌కు సరఫరా చేసింది. రానున్న రోజుల్లో భారత్ రక్షణ వ్యవస్థను ఆధునీకరించనుందని, ఈ మేరకు అమెరికా రక్షణ పరికరాల సంస్థలు ఆర్డర్లను సాధించడానికి పోటీపడుతున్నాయని అమెరికా నిపుణులు తెలిపారు. ఇటీవల కాలంలో అమెరికా సి-17 ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్, 155 ఎంఎం లైట్ వెయిట్ టోవడ్ హౌట్జిర్స్, యుజిఎం-84ఎల్ హార్పన్ మిసైళ్లు, సి-130జె సూపర్ హెర్క్యూల్స్ ఎయిర్ క్రాఫ్ట్, కెమికల్, బయలాజికల్, రేడియాలజికల్, న్యూక్లియార్ సంబంధిత పరికరాలను తయారు చేసి భారత్‌కు ఎగుమతి చేసింది. ప్రస్తుతం అమెరికా రక్షణ, భద్రత రంగాల్లో భారత్ వ్యూహాత్మక భాగస్వామిగా ఉందని అమెరికా రక్షణ రంగ నిపుణులు పేర్కొన్నారు. భారత్ ఒక ప్రధాన రక్షణ సామాగ్రి కొనుగోలు భాగస్వామి హోదాను ఇచ్చినట్లు అమెరికా పేర్కొంది. వచ్చే పదేళ్లు 2025 వరకు అమెరికా-్భరత్‌లు రక్షణ రంగంలో ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ ఒప్పందాన్ని 2015లో కుదుర్చుకున్న విషయం విదితమే.