అంతర్జాతీయం

ఉభయ తారకంగా సహకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టాక్‌హోమ్, ఏప్రిల్ 17: ఉభయతారకమైన రీతిలో అన్ని రంగాల్లోనూ వ్యూహాత్మ క భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలని భారత్-స్వీడన్ నిర్ణయించాయి. అలా గే రక్షణ, భద్రత సహకారాన్ని కూడా విస్తృ తం చేసుకోవాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వీడన్ ప్రధాని స్టీఫెన్ లావెన్‌ల మ ధ్య జరిగిన కీలక చర్చల్లో సంకల్పించారు. వినూత్న ఆవిష్కరణలు, వాణిజ్యం, పెట్టుబడులు, ప్రాంతీయ, అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించుకోవడం వంటి అనేక అంశాలపై వీరిద్దరి మధ్యా ఫలవంతమైన చర్చలు జరిగాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ తెలిపారు.
దాదాపు 30 ఏళ్ల అనంతరం భారత ప్ర ధాని స్వీడన్ సందర్శించడంతో మోదీ పర్యటనకు విశేష ప్రాచుర్యం లభించింది. గతరాత్రి ఎయిర్ పోర్టులో దిగిన ప్రధానికి స్వీడన్ ప్రధాన మంత్రి స్టీఫెన్ లోవెన్ స్వ యంగా స్వాగతం పలికారు. ఇద్దరు నేత లూ ఒకే కారులో మోదీ బస చేసే హోటల్ కు చేరుకున్నారని విదేశీ వ్యవహాల శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ ట్విట్టర్‌లో తెలిపా రు. స్వీడన్ రాజు కార్ల్-14 గుస్త్ఫ్‌తోనూ నరేంద్ర మోదీ సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారని కుమార్ తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధా ని మోదీ నార్డిక్ దేశాలైన ఫిన్లాండ్, నార్వే, డెన్మార్క్, ఐస్‌లాండ్ దేశాధినేతలతోనూ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అనంతరం ఇంగ్లండ్‌లో కామన్‌వెల్త్ ప్రభుత్వాధినేతల సమావేశం (చోగమ్)లో మోదీ పా ల్గొంటారు. ఇలావుండగా మంగళవారం స్టాక్‌హోమ్‌లో ఇండియా-నార్డిక్ సమ్మిట్‌లో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు లోవెన్ కూడా పాల్గొన్నారు. ఈ సదస్సుకు ఫిన్లాండ్, నార్వే, డెన్మార్క్, ఐస్‌లాండ్ దే శాల ప్రధాన మంత్రులు హాజరయ్యారు. మంగళవారం రాత్రి ఇంగ్లండ్‌కు పయనమ వుతారు. అక్కడ బ్రిటిష్ ప్రధాని థెరిసామె తో సమావేశమై చర్చలు జరుపుతారు. తిరు గు ప్రయాణంలో ఈ నెల 20న ఆయన జ ర్మనిలో ఆగి ఆ దేశంలోనూ పర్యటిస్తారు.