అంతర్జాతీయం

యూపీలో రోడ్డు ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్‌పురి (యూపీ), జూన్ 13: ఉత్తరప్రదేశ్‌లో బుధవారం తెల్లవారుజామున సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదంలో 17 మంది దుర్మరణం చెందగా, 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. రాజస్థాన్‌లోని జైపూర్ నుంచి యూపీలోని ఫరూఖాబాద్‌కు దాదాపు 70 మందితో కిక్కిరిసి వస్తున్న బస్సు ఉదయం 5.30 గంటల సమయంలో తీరత్‌పూర్ గ్రామం వద్ద అదుపు తప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొని పల్టీలు కొట్టిందని మెయిన్‌పురి ఎస్పీ అజయ్ శంకర్ రాయ్ విలేఖరులకు తెలిపారు. ఒక మహిళతోపాటు 16 మంది అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు సైఫాయ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు ఎస్పీ తెలిపారు. ప్రయాణికుల్లో ఎక్కువ మంది ఉత్తరప్రదేశ్‌కు చెందినవారేనని, కూలి పనుల నిమిత్తం జైపూర్ వెళ్లి తిరిగి సొంత గ్రామాలకు వస్తున్నారని ఆయన తెలిపారు. మృతదేహాలను గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. బస్సు లోపల కిక్కిరిసి పోవడంతో బస్సుపైన ఎక్కి పడుకున్నవారే ఎక్కువ మంది మృతిచెందారని అడిషనల్ ఎస్పీ ఓమ్ ప్రకాశ్ సింగ్ తెలిపారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే ఉన్నతాధికారులు, పోలీసులు సంఘటన జరిగిన ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతిచెందినవారికి రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందిస్తామన్నారు. ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం తెలిపారు.