అంతర్జాతీయం

అమెరికా సైన్యంలో ‘స్పేస్ ఫోర్స్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 19: ‘స్పేస్ ఫోర్స్’ను ఏర్పాటు చేయాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పెంటగాన్‌కు ఆదేశాలు జారీచేశారు. ప్రపంచంలో ‘అమెరికా ఆధిపత్యం’ కొనసాగాలంటే ఇది చాలా అవసరమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా చైనా, రష్యాలనుంచి ఎదురవుతున్న పోటీ నేపథ్యంలో ఆయన ఈ చర్య తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ‘స్పేస్ ఫోర్స్’ ఏవిధంగా ఉంటుంది? దాని విధివిధానాల వివరాలు స్పష్టంగా బయటకు వెల్లడి కాలేదు. అయితే ఇది చాలా ‘ప్రత్యేకమైందని’ కానీ వాయుసేన, నేవీ, కోస్ట్ గార్డ్, మెరైన్ కార్ప్స్‌కు ‘సరిసమాన’ స్థాయిలో ఉంటుందన్నారు. శే్వతసౌధంలో ఏర్పాటు చేసిన నేషనల్ స్పేస్ కౌన్సిల్ సభ్యుల సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ ప్రపంచం మొత్తం అమెరికా వైపు చూస్తున్నదని, దేశం మళ్లీ ఆ గౌరవాన్ని పొందాల్సి ఉన్నదన్నారు. అందువల్లనే సైన్యంలో ఆరోశాఖగా ‘స్పేస్ ఫోర్స్’ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని పెంటగాన్‌ను ఆదేశిస్తున్నట్టు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. స్పేస్‌లో రష్యా లేదా చైనా ఆధిపత్యం వహించడం తమకు ఎంతమాత్రం ఆమోదనీయం కాదన్నారు. స్పేస్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి అత్యాధునిక ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించాలని ఆయన కోరారు. అయితే ట్రంప్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఈ సరికొత్త సైనిక శాఖకు యుఎస్ కాంగ్రెస్ ఆమోదం తెలపాల్సి ఉంది. ‘అవసరమైనప్పుడు స్పేస్‌లో అమెరికా ఉండటం కాదు, స్పేస్‌లో అమెరికా అధిపత్యం కొనసాగాలి’ అని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికన్లను చంద్రుడిపైకి మళ్లీ పంపుతాం, అంగారకుడిపైకీ పంపుతామన్నారు.