అంతర్జాతీయం

చైనా పర్యటనలో కిమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, జూన్ 19: చైనా పర్యటన నిమిత్తం ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ మంగళవారం బీజింగ్‌కు చేరుకున్నారు. ఆయన ఇక్కడ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో చర్చలు జరపనున్నారు. ఈ నెల 12వ తేదీన సింగపూర్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్‌తో కిమ్ చర్చలు జరిపిన విషయం విదితమే. ఈ చర్చల విశేషాలను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు వివరించేందుకు కిమ్ వచ్చారు. ఈ ఏడాది బీజింగ్‌కు కిమ్ రావడం ఇది మూడోసారి. ఇటీవల కాలంలో బీజింగ్, వాషింగ్టన్‌కు మధ్య ట్రేడ్ వార్ ప్రారంభమైన విషయం విదితమే. ఈ నెల 19, 20 తేదీల్లో ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగన్ పర్యటిస్తారని మాత్రమే చైనా అధికార ఏజన్సీ ప్రకటించింది. కాగా కిమ్‌పర్యటనపై పూర్తి వివరాలు వెల్లడించడానికి చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి జింగ్ షాంఘ్ నిరాకరించారు. కిమ్ చైనా పర్యటనలో ఉన్నారని, ఒక లక్ష్యం కోసమే ఈ పర్యటన సాగుతుందన్నారు. సరైనసమయంలో మరిన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు. ఉత్తరకొరియాపై ఆంక్షలు ఎత్తివేయాలని రష్యా చేసిన డిమాండ్‌తో గొంతుకలపనున్నారా అని అడగ్గా, ఆంక్షలు పరిష్కారం కాదన్నారు. అణు నిరాయుధీకరణ, కొరియా ద్వీపకల్ప సమస్య పరిష్కారానికి చర్చలు అవసరమన్నారు. 2006లో ఉత్తరకొరియా తొలిసారిగా అణు పరీక్ష నిర్వహించింది. దీంతో ఐక్యరాజ్యసమితి ఆంక్షలు విధించింది. ఉత్తర కొరియాపై ఆంక్షలు ఎన్ని ఉన్నా, చైనా, ఉత్తర కొరియా మధ్య సంబంధాలు కొనసాగుతున్నాయి. ఈ నెల 12వ తేదీన ట్రంప్‌తో భేటీ అయ్యే ముందు బీజింగ్‌కు వచ్చి సింగపూర్‌కు కిమ్ వెళ్లడం గమనార్హం.
‘ఎన్డీఏ విధానాలతో ప్రజలకు ఇక్కట్లు’
పుదుచ్చేరి, జూన్ 19: కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం తన ఆర్థిక, ద్రవ్య విధానాల ద్వారా ప్రజలను నానాఇక్కట్లకు గురిచేసిందని పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి అన్నారు. నోట్లరద్దు, జీఎస్టీ ప్రవేశపెట్టడం, రైతులకు రుణాలు సక్రమంగా అందించలేకపోవడంతో దేశవ్యాప్తంగా ఎన్డీఏ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. రాహుల్ గాంధీ 48వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సమావేశంలో నారాయణస్వామి ప్రసంగించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి తప్పదని జోస్యం చెప్పారు.