అంతర్జాతీయం

మీ త్యాగాన్ని జాతి మరువదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ, జూన్ 20: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్ ఔరంగజేబు కుటుంబాన్ని కేంద్ర రక్షణ మంత్రి నిర్మలాసీతారామన్ బుధవారం పరామర్శించారు. ఈద్‌కు రెండు రోజుల ముందు జవాన్‌ను ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి, హత్య చేశారు. ఆర్మీ ఉన్నతాధికారులతో కలిసి రక్షణ మంత్రి బాధిత కుటుంబాన్ని కలిసి ఓదార్చారు. పూంచ్ జిల్లాలోని మారుమూల గ్రామం సలానీ చేరుకున్న నిర్మలా సీతారామన్ అమరజవాన్‌కు శ్రద్ధాంజలి ఘటించారు. ‘అమర జవాన్ కుటుంబాన్ని ఓదార్చడం కోసం ఇక్కడకు వచ్చాను’ అని బాధిత కుటుంబాన్ని పరామర్శించిన తరువాత మంత్రి మీడియాతో అన్నారు. ‘జాతి మొత్తం మీ వెంటే ఉంది. దేశం కోసం మీరు చేసిన త్యాగాలు జాతి ఎప్పటికీ మరువదు. భావితరాలకు మీరే స్ఫూర్తిగా నిలుస్తారు’ అని రక్షణ మంత్రి అన్నారు. అమర జవాను ఔరంగజేబు తండ్రి కూడా సైన్యంలో పనిచేసినవాడే. ఆయనను మంత్రి పరామర్శించారు. కాగా 44వ రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన ఔరంగజేబు ఈద్ పండుగ కోసం వస్తుండగా కిడ్నాప్‌కు గురయ్యాడు. ఈనెల 14న ఈ సంఘటన చోటుచేసుకుంది. కలాంపురలో జవాన్‌ను కిడ్నాప్ చేసి గుస్సు గ్రామంలో చంపేశారు. కాలంపుర పుల్వామా జిల్లా పరిధిలోకి వస్తుంది. ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ రెండ్రోజుల క్రితమే ఔరంగజేబు ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించారు. 30 నిముషాలు అక్కడ గడిపారు. ఇలా ఉండగా దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన తమ కుమారుడి ఆత్మకు శాంతి చేకూరాలంటే రాష్ట్రంలో ఉగ్రవాదులందర్నీ ఏరివేయాలని ప్రధాని మోదీ, ఆర్మీ చీఫ్ రావత్‌లకు ఔరంగజేబు కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. కుమారుణ్ని కోల్పోయిన మాజీ సైనికుడు మహ్మద్ హనీఫ్ ఎంతో భావోద్వేగానికి గురయ్యారు.