అంతర్జాతీయం

ట్రాక్టర్ ట్రాలీ ఢీ.. 15 మంది దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొరేనా (మధ్యప్రదేశ్), జూన్ 21: మధ్యప్రదేశ్‌లో మొరేనా జిల్లాలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 15 మంది దుర్మరణం చెందారు. మరణించాన తమ బంధువు సంతాప కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తున్న జీపును ట్రాక్టర్ ట్రాలీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన 20 మందితో వెళుతున్న జీపును ఉదయం ఆరు గంటల సమయంలో గంజ్‌రామ్‌పూర్ గ్రామంలో ఇసుకతో వెళుతున్న ట్రాక్టర్ ట్రాలీ ఢీకొట్టిందని మొరేనా ఎస్పీ అమిత్ సంఘి విలేఖరులకు తెలిపారు. సంఘటన జరిగిన ప్రాంతంలో 12 మంది చనిపోగా, మరో ముగ్గురు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ అశువులు బాశారని పోలీసులు తెలిపారు. మృతులంతా గ్వాలియర్ జిల్లాకు చెందినవారని, ఘుర్‌గాన్ గ్రామంలో మరణించిన తమ బంధువు సంతాప కార్యక్రమానికి హాజరై తిరిగివస్తూ రోడ్డు ప్రమాదానికి గురయ్యారని తెలిపారు. ట్రాక్టర్‌లో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని, ప్రమాదం జరిగిన వెంటనే ట్రాక్టర్ డ్రైవర్ పరారయ్యాడని పోలీసులు వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు తెలిపారు. మృతుల్లో ప్రేమా మహోర్ (50), వీణా మహోర్ (30), పారోబాయ్ (45), విజయ్ సింగ్ (60), రంచోడ్ (30), కుంటోబాయ్ (70), బల్లు (35), భూరి (50), గీతాబాయ్ (30), రామ్‌నివాస్ (25), రాజ్‌బీర్ (25), రామ్‌బేటి (30), అంతార్ సింగ్ (50), కైలాషి (50), ఉత్తమ్ (56) ఉన్నారు.