అంతర్జాతీయం

శాంతికి సోపానం యోగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్యసమితి, జూన్ 21: నైతిక విలువలు మృగ్యమై, వాణిజ్య దృక్పథంతో జీవిస్తున్న మానవాళి మానసిక వత్తిళ్ల నుంచి దూరమయ్యేందుకు యోగా మంచి పరిష్కారమని ఐక్యరాజ్య సమితి డిప్యూటీ సెక్రటరీ జనరల్ అమీనా మహమ్మద్ అన్నారు. అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, ప్రాచీన భారతం ప్రపంచానికి అందించిన గొప్ప సాధనం యోగా అని ప్రశంసించారు. ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన రాయబారులు, ఆధాయత్మికవేత్తలు, దౌత్యవేత్తలు, కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దాదాపు రెండు గంటలపాటు ఈ కార్యక్రమం జరిగింది. అమీనా మహమ్మద్ మాట్లాడుతూ, ఆధిపత్య, న్యూనతా ధోరణుల మధ్య నలుగుతున్న మానవ ప్రపంచానికి మానసిక వికారాలను తొలగించుకునేందుకు యోగా ఉపయుక్తంగా ఉంటుందన్నారు. అన్ని రంగాల్లో నైతిక విలువలను గాలికి వదిలేసి తిరుగుతున్నామని, జీవితం వత్తిళ్లతో సతమతమవుతోందని, ఊహాప్రపంచంలో యువకులు జీవిస్తున్నారని ఆమె అన్నారు. ఈ రుగ్మతల నుంచి బయటపడేందుకు యోగా మంచి పరిష్కారమన్నారు. భారతదేశం యోగాను ప్రపంచానికి కానుకగా ఇచ్చిందన్నారు. ప్రతి వ్యక్తి మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలన్నారు. శాంతి, భద్రత, మానవ హక్కుల పరిరక్షణ, అభివృద్ధి లక్ష్యంగా ప్రతి దేశం పనిచేయాలన్నారు. ఎక్కువ కాలం జీవించేందుకు, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం తప్పనిసరిగా యోగాను నిత్యం సాధన చేయాలన్నారు. ఐక్యరాజ్యసమితిలో భారత్ తరఫున శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ మాట్లాడుతూ, ఎటువంటి అసమానతలకు తావులేకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్యకరంగా జీవించేందుకు ప్రతి పౌరుడు యోగా పట్ల ఆకర్షితులవుతున్నారన్నారు. భారత్ నుంచి ప్రపంచంలోని అన్ని దేశాలకు యోగా విస్తరించిందన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ వీడియో ద్వారా సందేశాన్ని వినిపించారు. స్వామి పరమానంద శివానంద యోగా కార్యక్రమాలను నిర్వహించారు. చిన్మయా సెంటర్ యోగా గానామృతం అలరించింది. యోగాపై హెచ్‌ఆర్ నాగేంద్ర ప్రసంగించారు. యోగా ప్యానలిస్టులు వివిధ ప్రశ్నలకు బదులిచ్చారు. భారత్ నుంచి భారత్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్ అధ్యక్షుడు వినయ్ సహస్రబుద్ధి నేతృత్వంలో ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.