అంతర్జాతీయం

ఏకీకృత శక్తి యోగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డెహ్రాడూన్, జూన్ 21: అశాంతితో అల్లాడుతున్న ప్రపంచంలో అందరినీ సంఘటిత పరిచి మానసికపరమైన శాంతిని ప్రసాదించే అద్భుతమైన శక్తి యోగాకు ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గురువారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇక్కడి అటవీ పరిశోధన సంస్థ మైదానంలో 50వేల మందితో కలిసి ప్రధాని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానసిక రుగ్మతల నుంచి విముక్తి కల్పించి ఆరోగ్య ప్రపంచానికి బాటవేసిన ఘన చరిత్ర యోగాకు ఉందన్నారు. అనేక దేశాల్లో ప్రజలు యోగాను సొంతం చేసుకున్నారని, ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు ప్రజలు తమ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకున్నారన్నారు. ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలని, మానసిక వత్తిళ్ల నుంచి విముక్తి లభించాలని కోరుకుంటున్నారన్నారు. అశాంతి, మానసిక వత్తిళ్లకు దివ్యౌషధం యోగా. శాంతియుత ప్రపంచ సాధనకు యోగా మంచి మార్గాన్ని నిర్మిస్తుంది. డెహ్రాడూన్ నుంచి దూబ్లిన్ వరకు, షాంఘై నుంచి చికాకో వరకు, జకార్తా నుంచి జోహన్స్ బర్గ్ దాకా యోగాసనాలు చేసే సంస్కృతిని ప్రజలు అలవరచుకున్నారన్నారు. ‘సమాజంలో శాంతి, సమన్వయాన్ని యోగా పెంచుతోంది. దీనివల్ల జాతీయ సమగ్రత సాధ్యమవుతుం’ అని అన్నారు. ప్రపంచంలోని ప్రజలు, దేశాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు యోగా అద్భుతమైన ప్రక్రియ అని చెప్పేందుకు ఈ రోజు వివిధ దేశాల్లో యోగా కార్యక్రమాలు జరగడమే నిదర్శనమన్నారు. ప్రాంతాలకు అతీతంగా అందరినీ కలిపే శక్తి యోగాకు ఉందని, ప్రతి భారతీయుడు యోగా ధర్మాలను పాటించి భారత చరిత్ర, సంస్కృతి ఔన్నత్యాన్ని పరిరక్షించాలన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాల్లో విశిష్టస్థానం పొందిన యోగాను ఆచరిస్తే, ప్రపంచ దేశాల దృష్టిలో మనకు సమున్నతమైన గౌరవం లభిస్తుందన్నారు. నిశ్శబ్ధం, శాంతి, సృజనాత్మకత, సంతృప్తికరమైన జీవితాన్ని యోగాద్వారా సాధించవచ్చన్నారు. నిత్య జీవితంలో మనం అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాం. ఈ సమస్యలు వ్యక్తులు, సంస్థలతో అతలాకుతలం చేస్తున్నాయి. సమాజాన్ని విభజించకుండా సంఘటితం చేస్తున్న మహత్తర శక్తి యోగాకు ఉందని అన్నారు. యోగా సౌభ్రాతృత్వం పెంచుతుంది.. శత్రుత్వాన్ని మటుమాయం చేస్తుంది.. శారీరక బాధలను నయం చేస్తుందని అన్నారు. ప్రపంచాన్ని ఆశాజనకమైన కోణంలో చూసే ఆలోచనా శక్తిని యోగా ప్రేరేపిస్తుంది. యోగా ఒక అద్భుతమై సౌందర్య సాధనమని, ప్రాచీన, ఆధునికత అనే తేడాలేకుండా ప్రతినిత్యం ఆచరించే ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తుందన్నారు. ప్రతి భారతీయుడు యోగా విశిష్టతను చూసి గర్వించాని, టోక్యో నుంచి టొరంటో దాకా, స్టాక్ హోం నుంచి సోవ్‌పాలో వరకు యోగా ప్రతి వ్యక్తిలో సానుకూల ఆలోచనలను పెంపొందిస్తోందన్నారు. ఆరోగ్యానికి మాత్రమే యోగా ఉపయోగమనే ఆలోచన ధోరణిని విడనాడాలని, శాంతి, సంతోషకరమైన జీవనానికి కూడా యోగా రాచబాట అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
యోగాకు రోజురోజుకు పెరుగుతున్న ప్రాచుర్యం వల్ల భారత్‌కు ప్రపంచ దేశాలు చేరువవుతున్నాయన్నారు. ఉత్తరాఖండ్ పవిత్ర భూమి అని, అనేక యుగాలుగా యోగాకు ఇది నిలయం అని ఆయన ప్రశంసించారు. ఆదిగురు శంకరాచార్య నుంచి స్వామి వివేకానంద వరకు యోగాను అధ్యయనం చేసి ఆచరించి మార్గదర్శులుగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ కెకె పాల్, ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్, కేంద్ర మంత్రి శ్రీపాదనాయక్, రాష్ట్ర మంత్రి హరక్ సింగ్ రావత్ పాల్గొన్నారు. గులాబీ మొక్కల నుంచి సేకరించిన తైలం ఉన్న సీసాను మోదీకి ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ బహుకరించారు. ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు కేంద్రంగా చేయడం పట్ల ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే, మోదీ నవ ఉత్తరాఖండ్‌ను నిర్మిస్తున్నారని ఆయన శ్లాఘించారు. కాగా ఈ కార్యక్రమం సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారీ పెద్దఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు.