అంతర్జాతీయం

యోగాకు మతం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్య సమితి, జూన్ 22: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది యోగాను అభ్యాసం చేస్తున్నారని, దీనికి మతమంటూ ఏదీ లేదని భారత ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. న్యూయార్క్ రాష్ట్రంలోని కాట్‌స్కిల్స్ ప్రాంతంలో ‘యోవన్ లగ్జరీ నేచర్ క్యూర్ సెంటర్’ను ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ, ప్రపంచ ప్రజలను ఏకం చేయగల శక్తి యోగాకు ఉందన్నారు. రాజ్యసభ సభ్యుడు, ఎస్సెల్ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్ర నెలకొల్పిన ఈ యోగా కేంద్రంలో ఎంతోమంది భారత్, అమెరికాకు చెందిన ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. హోటల్ వ్యాపార దిగ్గజం, ఇండో-అమెరికన్ సంత్ సింగ్ చత్వాల్ వంటి ఎంతో మంది ప్రముఖులు కూడా సెంటర్‌లో యోగా చేశారు. ‘యోగాకు మతం లేదన్నది నా నమ్మకం. శారీరక, మానసిక ఆరోగ్యానికి, ఎదుగుదలకు ఇది ఉపయోగపడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన కోట్లాది మంది యోగను అభ్యాసం చేస్తున్నారు. దీనికి మతం అనేది లేదని స్పష్టం చేస్తున్నారు’ అని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచంలో యోగా ఒక ఉద్యమమైందని, ప్రతి ఒక్కరి జీవితంలో భాగంగా మారిపోయిందని మోదీ అన్నారు. ఇప్పటికే యోగాలో నైపుణ్యం పొందిన వారు, ఇతరులకు సాయం చేయాలని సూచించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రారంభమై కేవలం మూడు సంవత్సరాలే అయిందని, అయితే, ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రధాన్యతను సంతరించుకుందని చెప్పారు. యోగా సెంటర్ల ద్వారా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సుమారు రెండువేల మందికి ఉపాధి లభిస్తుందని అన్నారు. కాగా, యోగా కేంద్రాన్ని నెలకొల్పాలన్న తన చిరకాల కల ఇన్నాళ్లకు సాకారమైందని సుభాష్ చంద్ర వ్యాఖ్యానించారు.