అంతర్జాతీయం

ఖలీదా జియాకు బెయిల్ నిరాకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా, జూలై 2: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. దీనితో ఆమె కనీసం మరో నెల రోజులు జైలులోనే గడపాల్సి ఉంటుంది. మూడు పర్యాయాలు ప్రధానిగా బంగ్లాదేశ్ రాజకీయాల్లో చక్రం తిప్పిన 72 ఏళ్ల ఖలిదా జియాపై అవినీతి ఆరోపణలతోపాటు, మర్డర్ కేసు కూడా ఉంది. తన భర్త, బంగ్లాదేశ్ మాజీ పాలకుడు జియా ఉర్ రహ్మాన్ పేరుతో నెలకొల్పిన జియా ట్రస్టుకు 2.5 లక్షల డాలర్ల విరాళాలను అక్రమంగా పొందిందనే అభియోగాన్ని ఖలీదా ఎదుర్కొంటున్నది. అధికారాన్ని దుర్వినియోగం చేసి, భారీగా ఆస్తులు కూడబెట్టిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
కాగా, ఆమె నాయకత్వం వహిస్తున్న బంగ్లాదేశ్ నేషలిస్టు పార్టీ (బీఎన్‌పీ) 2015 ఫిబ్రవరిలో తన భాగస్వామ్య పర్టీ జమాత్‌తో కలిసి హేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ప్రదర్శన నిర్వహించింది. ఆ సమయంలోనే బీఎన్‌పీ కార్యకర్తలు ఒక బస్సును నిప్పటించారు. ఆ సంఘటనలో 18 మంది సజీవ దహనం కావడం అప్పట్లో సంచలనం సృష్టించింది. బీఎన్‌పీ అధ్యక్షురాలి హోదాలో ఖలీదా, ఇతర కీలక నేతలపై హత్యానేరం మోపి, కేసు పెట్టారు. అవినీతి ఆరోపణలపై హైకోర్టు ఆమెను ఐదేళ్ల జైలును విధించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ ఖలీదా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తనకు బెయిల్‌ను మంజూరు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అయితే, బెయిల్‌ను మంజూరు చేయడానికి బంగ్లాదేశ్ సుప్రీం కోర్టు నిరాకరించింది. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకూ ఆమె జైలులోనే ఉండాలని స్పష్టం చేసింది. ఇలావుంటే, ఒకవేళ ఈ కేసులో బెయిల్ లభించినప్పటికీ, ఆమెకు ఊరట దొరికే అవకాశం లేదన్నది వాస్తవం. బస్సు దహనం కేసులో ఆమె మార్చి 26న కోర్టుకు హాజరుకావాల్సి ఉండింది. కానీ, అనారోగ్యం కారణంగా అధికారులు అమెను కోర్టుకు తీసుకెళ్లలేదు. ఆ కేసులో ఆమెకు బెయిల్ లభించకపోవచ్చని నిపుణులు అంటున్నారు. ఏ రకంగా చూసినా, మరికొంత కాలం ఖలీదాకు జైలు జీవితం తప్పదు.