అంతర్జాతీయం

దివ్యాంగులకు శుభవార్త!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 4: దివ్యాంగులకు ఇప్పటి వరకూ అమరుస్తున్న కృత్రిమ చేతుల స్థానంలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన సరికొత్త చేతులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. బ్రిటన్‌లోని ఇంపీరియల్ కాలేజ్ లండన్, జర్మనీకి చెందిన గోటిన్‌జెన్ యూనివర్శిటీ శాస్తవ్రేత్తల బృందం చేస్తున్న పరిశోధనలు ఫలించాయి. ఆర్ట్ఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ని వినియోగించుకునే కృత్రిమ చేతిని వారు రూపొందించగలిగారు. మెదడు నుంచి వచ్చే ఆజ్ఞలను ఏఐ టెక్నాలజీ ద్వారా ఈ పరికరానికి అందుతుంది. వాటిని అనుసరించి కృత్రిమ చేతులు స్పందిస్తాయి. సాధారణ చేతులు ఏ విధంగా పని చేస్తాయో, ఏఐ టెక్నాలజీతో నడిచే కృత్రిమ చేతులు దాదాపుగా అదే రీతిలో పని చేస్తాయని శాస్తవ్రేత్తలు అంటున్నారు. ఐదుగురు దివ్యాంగులపై ఎన్నో రకాలుగా ప్రయోగాలు నిర్వహించిన అనంతరం వారు సరికొత్త కృత్రిమ చేతిని సృష్టించగలిగారు. ఈ సాంకేతిక విధానాన్ని భవిష్యత్తులో అన్ని రకాల కృత్రిమ అవయవాలకూ ఉపయోగించుకోచ్చని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీరి ప్రయోగం సఫలమైతే, త్వరలోనే దివ్యాంగుల జీవితాల్లో కొత్త వెలుగు వస్తుంది.