అంతర్జాతీయం

రష్యా మాజీ గూఢచారి స్క్రిపాల్‌పై విష ప్రయోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 4: రష్యాలో పనిచేసిన మాజీ గూఢాచారి, అతని కుమార్తెపై విషప్రయోగం జరిగినట్లుగా భావిస్తున్న సంఘటన ఇంగ్లాండ్‌లో సంచలనం సృష్టిస్తోంది. లండన్‌కు సమీపంలోని శాలిస్‌బ్యూరీ పట్టణానికి 16 కి.మీ దూరంలో ఉన్న ఏమ్స్‌బ్యూరీలో ఈ ఘటన చోటు చేసుకుంది. రష్యాలో గూఢాచారిగా పనిచేసిన సెర్గి స్క్రిపాల్, ఆయన కుమార్తె యూలియాలు ఇంట్లో స్పృహ తప్పి పడిపోయి ఉన్న సమాచారం పోలీసులకు తెలిసింది. దీంతోపోలీసులు రంగంలో దిగి వారిని ఆసుపత్రికి తరలించారు.
తొలుత హెరాయిన్ లేదా ఇతర మాదకద్రవ్యాలు సేవించడం వల్ల స్పృహ తప్పినట్లు పోలీసులు భావించారు. కాని మిలిటరీలో ఉపయోగించే నోవిచోక్ అనే పదార్ధాన్ని వీరిపై ప్రయోగించనట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే విల్ట్‌షీర్ పోలీసులు మాజీ గూఢాచారి స్క్రిపాల్ ఇంటిని చుట్టుముట్టి తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. వీరిని శాలిస్‌బ్యూరీ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అంతకుముందు రోజు తండ్రీ కూతుళ్లు సమీపంలో ఉన్న బాప్టిస్ట్ చర్చిలో జరిగిన కుటుంబ వినోద కార్యక్రమానికి హాజరైనట్లు పోలీసులు చెప్పారు. కాగా ఈ ఘటనతో తమకు ఎటువంటి సంబంధంలేదని రష్యా పేర్కొంది. ఇంగ్లాండ్ మాత్రం రష్యా మిలిటరీలో ఉపయోగించే ఒక మత్తు పదార్ధాన్ని వీరిపై ప్రయోగించనట్లు అనుమానం ఉందని పేర్కొంది. ఈ ఘటనపై బ్రిటన్, రష్యా దేశాలు దౌత్యపరంగా పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి.