అంతర్జాతీయం

మెక్సికోలో పేలుళ్లు 24 మంది దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టుల్టెపెక్, జూలై 6: మెక్సికోలోని టుల్టెపెక్ నగరంలో బాణాసంచా దుకాణంలో సంభవించిన పేలుళ్లలో 24 మంది దుర్మరణం చెందారు. వరుస పేలుళ్లలో 49 మంది గాయపడ్డారు. పేలుళ్ల దాటికి పలు భవనాలు ధ్వంసమయ్యాయి. పేలుళ్ల సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి వెళ్లిన నలుగురు అగ్నిమాపక సిబ్బంది, ఇద్దరు పోలీసులు అధికారులు చనిపోయారు. బాణాసంచా కేంద్రంలో మొదటి సారి పేలుళ్లు జరిగిన వెంటనే అధికారులు అక్కడి చేరుకున్నారు. తరువాత వరుసగా పేలుళ్లు చోటుచేసుకున్నాయి. బాణాసంచా దుకాణం ఓ జాతీయ రహదారి పక్కనే ఉంది. పేలుళ్ల దాటికి మూడు భవనాలు కుప్పకూలిపోయాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసి భయానక పరిస్థితి నెలకొంది. నాలుగు చిన్న భవనాలు ధ్వంసమయ్యాయని అధికారులు వెల్లడించారు. ఈ ఘోర ప్రమాదంలో ఎనిమిది మంది స్థానికులు మృతి చెందారని మెక్సికో ప్రభుత్వం తెలిపింది. ఆరుగురు అత్యవసర విభాగం అధికారులు ప్రాణాలు కోల్పోయినట్టు చెప్పారు. మృతుల్లో ఇద్దరిని గుర్తించాల్సి ఉందని అన్నారు. ప్రమాదంలో 24 మంది మరణించినట్టు తొలుత అధికారులు వెల్లడించారు. మొదటిసారి పేలుళ్లు శుక్రవారం ఉదయం 9.40 గంటల ప్రాంతంలో సంభవించాయి. స్థానికులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకునిన సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మళ్లీ 10 గంటలకు మూడు భారీ పేలుళ్లు సంభవించాయి. సాయం అందించేందుకు వెళ్లిన వారిలో కొందరు మృత్యువాత పడ్డారని ప్రభుత్వం తెలిపింది. గాయపడ్డవారిలో అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు, అధికారులున్నారు. 17 మంది సంఘటనా స్థలంలోనే చనిపోగా ఆసుపత్రికి తరలించిన తరువాత ఏడుగురు మృతి చెందారని చెప్పారు. క్షతగాత్రులను హెలికాప్టర్లలో వివిధ ఆసుపత్రులకు తరలించారు. ఎలాంటి అనుమతుల్లేని ఓ బాణాసంచా కేంద్రం నుంచి ముందు పేలుళ్లు మొదలయ్యాయని మెక్సికో సివిల్ డిఫెన్స్ ఏజన్సీ చీఫ్ లూయిస్ ఫెల్పీ పుంటే స్పష్టం చేశారు. అక్కడ నుంచి మంటలు ఎగసిపడడంతోపాటు సామగ్రి గాలిలో ఎగిరి వచ్చి పక్కన పడ్డాయని ఆయన వివరించారు. మొదటి పేలుళ్లు జరిగినప్పుడు సహాయం చేయడానికి అక్కడి వెళ్లిన వారు మృత్యువాత పడ్డారని ఆయన అన్నారు. వెంటవెంటనే పేలుళ్లు చోటుచేసుకోవడంతో తప్పించుకోలేకపోయారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ గత నెలలో బాణాసంచా పేలుళ్లలో ఏడుగురు మృతి చెందారు. ఎనిమిది మంది గాయపడ్డారు.