అంతర్జాతీయం

ప్రతి గుజరాతీ ఐదుగురు విదేశీయులను భారత్‌కు పంపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూలై 6: అమెరికాలో నివసిస్తున్న ప్రతి గుజరాతీ అక్కడ నివసిస్తున్న ఐదు విదేశీ కుటుంబాలు భారత్‌ను సందర్శించేలా ప్రేరణ కల్పించాలని భారత ప్రధాని నరేంద్రమోదీ సూచించారు. యుఎస్‌లోని సౌరాష్ట్ర పటేల్ కల్చరల్ సమాజ్‌తో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ‘హోటల్ మోటెల్ పటేల్ వాలా’లుగా ప్రసిద్ధిపొందిన గుజరాతీలు వారి హోటళ్లలో అతిథులు దిగినప్పుడు ఇండియా ప్రాశస్త్యం గురించి టీవీ స్లైడ్‌ల ద్వారా ఎందుకు ప్రచారం చేయకూడదని సూచించారు. అమెరికాలోని సగం మోటెల్స్ ఇండియన్ అమెరికన్‌ల చేతిలోనే ఉన్నాయని, అందులో 70 శాతం మంది పటేళ్లని ఆయన చెప్పారు. మీరందరూ భారత్‌లో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకపోయినా ఫర్వాలేదు.. ఒక్కో ఎన్‌ఆర్‌ఐ ఐదుగురు విదేశీయులు భారత్‌ను సందర్శించేలా ప్రేరేపించండి చాలు అని మోదీ పేర్కొన్నారు. ఈ ఏడాది భారత్‌లో జరిగే కుంభమేళాను దర్శించేలా ఎన్‌ఆర్‌ఐలు విదేశీయులను ప్రోత్సహించాలని, దీనివల్ల భారత్ టూరిజం పరిశ్రమకు పెద్దయెత్తున లాభం చేకూరుతుందని ఆయన అన్నారు. విదేశీయులు అధిక సంఖ్యలో భారత్‌ను సందర్శించేలా ప్రోత్సహిస్తే భారత్‌ను ఉగ్రవాద కార్యకలాపాల దేశంగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్న కొన్ని దేశాల నోళ్లు మూతపడతాయని ఆయన అన్నారు. గత ఐదు దశాబ్దాలుగా భారత్ గౌరవాన్ని తగ్గించడానికి, అప్రదిష్టపాలు చేయడానికి అవి చేయని ప్రయత్నాలు లేవని ఆయన పాకిస్తాన్ దేశం పేరును ప్రస్తావించకుండా విమర్శించారు. వారికి కొన్ని దేశాలు వత్తాసు పలికాయని, ఇప్పుడు పరిస్థితి మారిందని, ఎవరో ఒకరిద్దరు తప్ప ప్రపంచమంతా మనకు అండగా నిలుస్తోందని మోదీ అన్నారు. ఉగ్రవాదంపై భారత్ వైఖరిని ప్రపంచమంతా సమర్థిస్తోందని ఆయన చెప్పారు. భారత్ ప్రతిష్టను విదేశీయుల్లో ఇనుమడింపజేయడానికి మీ వంతు ప్రయత్నం మీరు చేయాలని ఆయన కోరారు.