అంతర్జాతీయం

1,220 మంది యాత్రికుల తరలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాట్మాండూ, జూలై 6: మానస సరోవర్ యాత్రకు వెళ్లి నేపాల్ హిమాలయ ప్రాంతాల్లో సిమికోట్‌లో చిక్కుకున్న 1220 మంది యాత్రికులను సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు భారత్ ఎంబసీ ప్రకటించింది. హిల్సాలో ఉన్న యాత్రికులను రక్షించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. సిమికోట్ నుంచి రక్షించిన వారిని నేపాల్ గంజ్‌కు చేర్పించారు. భారత్ సరిహద్దుకు సమీపంలో నేపాల్ గంజ్, సుర్కేట్ అనే చిన్న పట్టణాలు ఉన్నాయి. ఇక్కడ మెరుగైన వైద్య సదుపాయాలు ఉన్నాయి. ఇంతవరకు దాదాపు 1220 మందిని రక్షించి ఈ పట్టణాలకు చేర్పించామని ఎంబసీ అధికారులు చెప్పారు.
హిల్సాలో ఉన్న మరో 675 మందిని విమానం ద్వారా నేపాల్‌గంజ్‌కు తరలించేందుకు భారత్ మిషన్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 74 కమర్షియల్ విమానాల సేవలను వినియోగించుకుంటున్నారు. నేపాల్ ఆర్మీ అధికారులు కూడా ప్రత్యేక హెలికాప్టర్లను ఏర్పాటు చేశారు. అత్యంత ప్రమాదకరమైన భౌగోళిక ప్రాంతాల నుంచి వీరిని తరలించడం కత్తిమీద సవాలుగా మారిందని అధికారులు చెప్పారు. ఇప్పటికే నేపాల్‌గంజ్‌కు చేరుకున్న యాత్రికులు భారత్‌లో తమ స్వస్ధలాలకు చేరుకునేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. మానస సరోవర్ యాత్ర చేయాలనుకునే వారు ముందుగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని భారత్ ఎంబసీ యాత్రికులకు సూచించింది. ప్రతికూల వాతావరణం వల్ల భారత్‌కు చెందిన 1500 మంది యాత్రికులు సిమికోట్, హిల్సాలో చిక్కుకుంటే భారత్, నేపాల్ అధికారులు వీరిని రక్షించేందుకు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. యాత్రికుల్లో ఆంధ్ర, కర్నాటక, తమిళనాడు, కేరళకు చెందిన వారున్నారు.