అంతర్జాతీయం

శాస్తవ్రేత్తలు, విద్యావేత్తలకు యూకే కొత్త వీసా విధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 7: దేశంలో పరిశోధనా రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి వీలుగా భారత్‌సహా వివిధ దేశాల శాస్తవ్రేత్తలు, విద్యావేత్తలకు యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) కొత్త వీసా విధానాన్ని ప్రకటించింది. శాస్త్ర, సాంకేతిక, పరిశోధన, విద్యాది రంగాల అభివృద్ధి కోసం ప్రస్తుతం టైర్-5 వీసా నిబంధనలకు కొత్త విధానం అనుసంధానమవుతుంది. వివిధ దేశాల విద్యావేత్తలు, శాస్తవ్రేత్తలు, పరిశోధకులకు వీసా నిబంధనలను ఈ కొత్త విధానంలో చాలా వరకు సడలించారు. పరిశోధన, సాంకేతిక రంగాల్లో యూకే ఎంతో అభివృద్ధిని సాధించిందని, దీనిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి వీలుగా శాస్తవ్రేత్తలు, విద్యావేత్తలు, పరిశోధకులకు ఆహ్వానం పలుకుతూ కొత్త విధానానాలను అమలు చేస్తున్నామని యూకే ఇమ్మిగ్రేషన్ శాఖ మంత్రి కరోలిన్ నోక్స్ తెలిపారు. యూకే ఆర్థిక వ్యవస్థలో పరిశోధనా రంగం ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తున్నదని ఆమె చెప్పారు. తక్షణం అమల్లోకి వచ్చిన కొత్త వీసా విధానంతో ప్రపంచ దేశాల నుంచి ఎంతో మంది శాస్తవ్రేత్తలు, పరిశోధకులు యూకేకు తరలివస్తారన్న ఆశాభావం వ్యక్తం చేసింది.