అంతర్జాతీయం

ఉత్తర కొరియాలో పౌష్టికాహార లేమితో బాలలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సియోల్, జూలై 11: ఉత్తర కొరియా అణ్వస్త్రాల తయారీలో ముందంజలో ఉండి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. కాని దేశంలోని బాలల్లో ఐదో వంతు మంది పౌష్టికాహార లేమితో సతమతమవుతున్నారు. ఈ వివరాలను ఐరాస మానవతా సహాయ విభాగం వెల్లడించింది. ఐరాస మానవత సహాయ విభాగం కార్యదర్శి మార్క్ లోకాక్ ఉత్తరకొరియాను ఇటీవల కాలంలో తొలిసారిగా సందర్శించారు. 2011 తర్వాత ఐరాస ప్రతినిధిగా ఆయన ఉత్తరకొరియాను సందర్శించడం ఇదే తొలిసారి. గ్రామీణ ప్రాంతాల్లో పరిశుద్ధమైన నీరులేదు. పిల్లలు బలహీనంగా కనపడుతున్నారు. పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు అని మార్‌క లోకాక్ ట్వీట్ చేశారు. ట్వీట్‌లో వీడియో క్లిప్పింగ్‌లను కూడా జతపరిచారు. దేశంలో 20 శాతం మంది పిల్లలు అనారోగ్యంతో ఉన్నారని చెప్పారు. తాను ఒక ఆసుపత్రికి వెళ్లానని అక్కడ 140 మంది రోగులు క్షయవ్యాధితో బాధపడుతున్నారు. అందులో 40 మందికి మాత్రమే ఔషధాలు అందుతున్నాయి. దేశంలో జనాభా 25 మిలియన్లు ఉంది. ఇందులో 10.6 మిలియన్ల మందికి తప్పనసరిగా మానవతా సహాయం అందించాల్సి ఉందని ఐరాస పేర్కొంది. ఐదేళ్లలోపు పిల్లల్లో 20 శాతం మంది అకాల మృత్యువుబారినపడుతున్నారు. 2017 నవంబర్ నుంచి బాలల సంరక్షణ కేంద్రాలకు నిధులు అందడంలేదు. పౌష్టికాహారం సమకూర్చేందుకు ఐరాస 111 మిలియన్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ఉత్తర కొరియా దశాబ్ధాల తరబడి అనేక కారణాల వల్ల తీవ్ర దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటోంది. ప్రపంచ దేశాల్లో ఏకాకిగా మారింది. అణ్వస్త్రాలు, మిసైళ్ల తయారీ వల్ల అనేక ఆంక్షలను ఎదుర్కొంటోంది. వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పుల వల్ల ఇటీవల కాలంలో కొంత మేరకు పరిస్థితులు కుదుటపడ్డాయి. కాని ప్రకృతి విపత్తులకు గురవుతున్నారు. వైద్య సహాయం అందక లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు.