అంతర్జాతీయం

కొంపముంచే ట్రంప్ నిర్ణయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఏప్రిల్ 26: హెచ్1బీ వీసాల రద్దుచేయాలన్న డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాన్ని ఇండో- అమెరిన్ డెమోక్రటిక్ పార్టీ ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అమెరికాలో హెచ్1బీ వీసాలతో ఉద్యోగాలు చేస్తున్నవారి జీవిత భాగస్వాములు కూడా ఉద్యోగం చేసుకోవడానికి అనుమతి ఉంది. హెచ్1బీ వీసాదారుల భాగస్వాములు హెచ్ 4 వీసాతో ఉద్యోగం చేస్తుంటారు. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడా విధానానికి ముగింపుపలకనున్నారు. ఇదే జరిగితే 70వేల మంది హెచ్-4 వీసా దారులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ప్రభుత్వ నిర్ణయం భారతీయు వృత్తిపనిదారులకు ఇది గొడ్డలిపెట్టే. హెచ్1బీ వీసాదారుల దంపతులు ఇద్దరూ చట్టబద్ధంగా ఇక్కడ ఉద్యోగం చేసుకోడానికి 2015లో అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. హెచ్-4 వీసాలున్నవారిలో భారతీయులే ఎక్కువ మంది ఉన్నారని ట్రంప్ ప్రభుత్వం అనాలోచిత చర్య వల్ల వారే ఎక్కువ నష్టపోతారని ఇండియన్-అమెరికన్ ఎంపీ ప్రమీల జైపాల్ తెలిపారు. యుఎస్ ఫ్రెండ్‌షిప్ కౌన్సిల్‌లో ఆమె మాట్లాడుతూ తక్షణం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ట్రంప్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘వర్క్ పర్మిట్‌కు సంబంధించి హెచ్-4 వీసాల రద్దు యోచనను మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం’అని ఆమె వెల్లడించారు. యుఎస్ ప్రతినిధుల సభకు ఎన్నికైన తొలి ఇండియన్-అమెరికన్ మహిళ ప్రమీల. ట్రంప్ నిర్ణయం లింగ వివక్ష కిందకే వస్తుందని ఆమె వాదించారు. ఎందుకంటే హెచ్-4 వీసాపై అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటున్న వారిలో ఎక్కువ మంది మహిళలేనని ఆమె గుర్తుచేశారు. ఎంపీగా ఎన్నికకాక ముందు హెచ్1బీ వీసా దారుల జీవిత భాగస్వాములకు ఉద్యోగం చేసుకునే అనుమతి ఇవ్వాలంటూ పోరాడారు. ఒబామా ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో అనేక మంది భారతీయ మహిళలకు ఇక్కడ పనిచేసుకునే అవకాశం కలిగింది. వర్క్ పర్మిట్‌కు అనుమతి ఇస్తూ ఒబామా ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. దీని వల్ల ఎక్కువ ప్రయోజనం పొందింది భారతీయులేనని ఆమె తెలిపారు. మొత్తంగా లక్ష మం దికి పైగా హెచ్-4 వీసాలతో ఉద్యోగాలు పొందారని ఆమె చెప్పారు. దేశాభివృద్ధికి దోహదం చేస్తున్న ఈ విధానాన్ని ట్రంప్ ప్రభుత్వం ఎందుకు రద్దుచేయాలనుకుంటుంది? అంటూ ఆమె నిలదీశారు. డెమోక్రటిక్ ఎంపీలు జో క్రౌలే, అమీ బేరా, రాజా కృష్ణమూర్తి తదితరులు ట్రంప్ ప్రభుత్వం నిర్ణయాన్ని నిరసించారు. హెచ్1బీ వీసాల వల్ల నిపుణులైన వృత్తిదారుల సేవలు అందుతాయని రిపబ్లికన్‌పార్టీ సెనెటర్ టామ్ ట్రిల్లిస్ చెప్పారు.