అంతర్జాతీయం

తండ్రి చేతిలో చిత్రహింసలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాస్ ఏంజిల్స్, జూలై 11: పాప్ సంగీత ప్రపంచానికి రారాజుగా వెలిగిపోయిన మైఖేల్ జాక్సన్ అత్యంత దుర్భరమైన జీవితాన్ని అనుభవించాడు. ప్రత్యేకించి కన్నతండ్రి జో చేతిలో చిత్ర హింసలు అనుభవించాడు. ఈ విషయాలను అతనికి వ్యక్తిగత వైద్యుడిగా సేవలు అందించిన కన్‌రాడ్ ముర్రే తాజాగా విడుల చేసిన ‘ది బ్లాస్ట్’ వీడియోలో వెల్లడించాడు. జాక్సన్ గొంతులో మార్ధవం ఏమాత్రం తగ్గకుండా, కొద్దిగా అమ్మాయిని పోలిన గొంతుకతో పాడేందుకు వీలుగా జో అతనిని మందులతో నపుంసకుడిగా మార్చేశాడని ఆరోపించాడు. ఇటీవలే తన 89 ఏళ్ల వయసులో మృతిచెందిన జో పట్ల తనకు ఎలాంటి గౌరవం లేదని, నిజానికి అతని మరణం తనకు ఆనందాన్ని ఇచ్చిందని ముర్రే పేర్కొన్నాడు. ‘ప్రపంచంలోనే జో లాంటి క్రూరుడైన తండ్రి మరొకడు ఉండడు. సొంత కొడుకునే చిత్రహింసలు పెట్టాడు. అతనికి విపరీతంగా డ్రగ్స్‌ను అలవాటు చేశాడు. ఔషధాల సాయంతో నపుంసకుడిగా మార్చేశాడు. అమ్మాయిని పోలిన గొంతుతో జాక్సన్ పాడిన పాటలకు ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉండడాన్ని గమనించిన జో అతనికి పురుషుడి గాత్రం రాకుండా జాగ్రత్తపడ్డాడు. అందుకే, అతడిని నపుంసకుడిగా మార్చేశాడు. ఒత్తిడికి గురికాకుండా ఉండడానికి, అలసట తెలియకుండా నిరంతరం ప్రదర్శనలు ఇవ్వడానికి వీలుగా డ్రగ్స్ కూడా అలవాటు చేశాడు’ అని వివరించాడు. జో నుంచి జాక్సన్ ఎదుర్కొన్న సమస్యలు బహుశా ఏ కుమారుడికీ తండ్రి నుంచి ఎదురై ఉండవని వ్యాఖ్యానించాడు. 2009లో జాక్సన్ హఠాన్మరణం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. విపరీతంగా మాదక ద్రవ్యాలు వాడినందుకే జాక్సన్ మృతి చెందాడని, ఇందుకు ముర్రేనే కారణమని జో ఆరోపించాడు. అంతేగాక, అతనిపై హత్య నేరాన్ని మోపుతూ కేసు పెట్టాడు. ఆ తర్వాత హఠాత్తుగా కేసును ఉపసంహరించుకున్నాడు. అయితే, అప్పటికే ముర్రే రెండేళ్లు జైలులో గడపాల్సి వచ్చింది.