రాష్ట్రీయం

పాక్ ఎన్నికల ర్యాలీపై ఉగ్రపంజా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, జూలై 11 పాకిస్తాన్ రక్తసిక్తమైంది. ఈ నెల 25వ తేదీన ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పెషావర్‌లో ఎన్నికల ర్యాలీపై తాలిబాన్లకు చెందిన ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 13 మంది మృతి చెందగా, 54 మంది గాయపడ్డారు. అవామీ నేషనల్ పార్టీ నేత హరూన్ బైలర్ ప్రసంగిస్తున్న ర్యాలీని ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడ్డారని పోలీసులు చెప్పారు. లౌకిక, వామపక్ష భావజాలం ఉన్న బైలర్‌కు గతంలో తాలిబాన్లు అనేక సార్లు హెచ్చరికలు జారీ చేశారు. ఇస్లాం వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డవదని బెదిరించారు. ఈ ఆత్మాహుతి దాడికి తామే పాల్పడ్డామని పాకిస్తాన్ తాలిబాన్ ప్రతినిధి మహ్మద్ ఖుర్సానీ ప్రకటించారు. ఖైబర్ ఫక్తూన్‌కావా ప్రోవిన్స్‌లో ఎన్నికల ప్రచారం జరుగుతుండగా ఈ దాడి జరిగింది. బైలూర్ తండ్రి, మాజీ మంత్రి బషీర్ అహ్మద్ బైలూర్‌ను కూడా తాలిబాన్లు గతంలో హత్య చేశారు. ఈ ఘటన 2012లో జరిగింది. ఆత్మాహుతిదాడి ఘటన జరిగిన ప్రదేశానికి పోలీసులు చేరుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు. కాగా ప్రజలు ఇస్లాం వ్యతిరేకత ఉన్న పార్టీలను, నేతలకు దూరంగా ఉండాలని తాలిబాన్లు ప్రజలను హెచ్చరించారు. తమ సందేశాన్ని పట్టించుకోకపోతే ఆత్మాహుతిదాడులకు పాల్పడుతామన్నారు. కాగా ఈ నెల 25వ తేదీన జరగనున్న ఎన్నికల సందర్భంగా దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్, ఎఎన్‌పీ నేత అస్ఫాన్‌దైర్ వలీ, మరో ఆరుగురు నేతలకు ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందని పాకిస్తాన్ నేషనల్ కౌంటర్ టెర్రరిజం అథారిటీ ప్రకటన జారీ చేసింది. ఈ ఎన్నికల్లో 105 మిలియన్ల మంది ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు.