అంతర్జాతీయం

బస్సుపైకి దూసుకెళ్లిన ట్రక్కు - 18 మంది దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, జూలై 16: నిలిచి ఉన్న బస్సుపైకి ఒక ట్రేలర్ ట్రక్కు దూసుకెళ్లిన సంఘటనలో 18 మంది మృతి చెందారు. సుమారు 30 మంది గాయపడ్డారు. వీరిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉంది. పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావీన్స్, హైదరాబాద్ జిల్లాలో సోమవారం ఉదయం ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీస్ అధికారులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ పట్టణానికి చెందిన కొంత మంది సక్రాంద్‌లో ఓ పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్నప్పుడు హలా వద్ద వారు ప్రయాణిస్తున్న బస్సు టైరు పంక్చరైంది. దీనితో బస్సును హైవే పైనే ఒక పక్కగా నిలిపి, టైరు మారుస్తున్న సమయంలో, వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు బలంగా ఢీకొట్టింది. 11 మంది అక్కడికక్కడే మృతి చెందారంటే, ప్రమాదం జరిగిన తీవ్రత స్పష్టమవుతుంది. మరో ఏడుగురు ఆసుపత్రిలో చేర్చిన కొద్ది సేపటికే మరణించారు. మృతుల్లో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు. కాగా, గాయపడిన వారిలో కనీసం పది మంది పరిస్థితి విషమంగా ఉందని, ఫలితంగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు. ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యం, అతి వేగమే ప్రమాదానికి ప్రధాన కారణాలని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఆ జెండాలపై మీ వైఖరేంటి? - కేంద్రాన్ని వివరణ కోరిన సుప్రీం
న్యూఢిల్లీ, జూలై 16: దేశంలో హిందూ-ముస్లింలు ఉన్న ప్రాంతాల్లో నెలవంక, నక్షత్రంతో కూడిన పచ్చజెండాలు ఎగురవేసిన విషయమై తగిన వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. షియా వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ వసీమ్ రిజ్వీ చేసిన అభ్యర్థన మేరకు జస్టిస్ ఏ.కే.సిక్రీ, అశోక్ భూషణ్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం ఈ వివరణ కోరింది. ఇటీవల తాను ముంబయితోపాటు దేశంలోని పలు ప్రాంతాలను సందర్శించిన సందర్భంగా ఆ తరహా జెండాలు ఎగురుతున్న విషయాన్ని గమనించానని, అవి పాకిస్తాన్‌కు చెందిన ఒక రాజకీయ పార్టీ జెండాను పోలినట్లు ఉన్నాయని పిటిషనర్ రిజ్వీ పేర్కొన్నారు. పరాయి దేశానికి చెందిన జెండాలు ఎగురవేయడం వల్ల స్థానికంగా హిందూ-ముస్లింల మధ్య విభేదాలకు దారితీసే ప్రమాదం లేకపోలేదని ఆయన పేర్కొన్నారు. ఆ తరహా పతాకాలు 1906 నాటి ముస్లిం లీగ్ వ్యవస్థాపకుడు నవాజ్ వక్వర్ ఉల్ మాలిక్, మహమ్మద్ అలీ జిన్నా కాలంనాటివాటితో పోలి ఉన్నాయని ఆయన తెలిపారు.