అంతర్జాతీయం

చేతులకు సంకెళ్లు.. కదలికలపై ఆంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అస్టోరియా (ఒరెగాన్), జూలై 16: భారత శరణార్థులు అమెరికా జైలులో దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. చేతులకు సంకెళ్లతో, కదలికలపై ఆంక్షలతో ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నారు. అక్రమంగా దేశంలోకి చొరబడ్డారని, స్వదేశానికి వెళ్లకుండా తిష్టవేశారని ఆరోపిస్తూ ఒరెగాన్ పోలీసులు అరెస్టు చేసిన యాభై మందికిపైగా భారతీయుల పరిస్థితి దారుణంగా ఉంది. అక్రమ చొరబాట్లను ఎట్టిపరిస్థితుల్లోనూ అడ్డుకుంటామని, ఈ విషయంలో రాజీ ప్రసక్తే ఉండదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేసిన తర్వాత, అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. దేశంలో అక్రమంగా ఉంటున్న వివిధ దేశాలకు చెందిన వారిని అరెస్టు చేసి, జైళ్లలో ఉంచుతున్నారు. విచారణ తర్వాత వారిని తమతమ స్వదేశాలకు పంపుతామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇలావుంటే, జైళ్లలో జీవితం గడుపుతున్న వారి పరిస్థితి దుర్భరంగా ఉందని, ఒరెగాన్ జైల్లో ఉన్న భారతీయుల దుస్థితే ఇందుకు ఉదాహరణ అని ఒక కమ్యూనిటీ కాలేజీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న నవనీత్ కౌర్ పేర్కొంది. ‘యాభైకిపైగా భారతీయులు ఒరెగాన్ జైలులో ఉన్నారు. వారిలో ఎక్కువ మంది శిక్కులు. 18 నుంచి 24 ఏళ్లలోపు వారే అధికారులు. వీరిని జైల్లో సంకెళ్లతో బంధించారు. చివరికి భోజనం చేసే సమయంలో కూడా చేతికి తగిలించిన గొలుసులను తీయడం లేదు. సిక్కులు ఎంతో పవిత్రంగా చూసుకునే తలపాగాలను కూడా జైలు అధికారులు తొలగించారు. కనీసం తలను కప్పుకోవడానికి చిన్న రుమాలునైనా ఇవ్వడం లేదు. భయంకరమైన నేరాలు చేసిన వారికి కూడా జైల్లో ఇలాంటి పరిస్థితి ఉండదు. అక్రమంగా దేశంలో ఉన్నారన్న కారణంగా అరెస్టు చేసిన వారిని కరుడుగట్టిన తీవ్రవాదుల మాదిరి పరిగణించడం, నిరంతరం సంకెళ్లతో బంధించడం అత్యంత దారుణం’ అని నవనీత్ కౌర్ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. ఇలావుంటే, దేశంలోకి చొరబడి, ఆతర్వాత శరణార్థులమంటూ ప్రకటించుకుంటున్నారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న వారు ఒరెగాన్ జైలులో 123 మంది ఉన్నట్టు సమాచారం. వీరిలో అత్యధికులు భారతీయులే. అందులోనూ సిక్కులే. ఇమ్మిగ్రేషన్ విధానాలను కఠినతరం చేసిన అమెరికా ఇప్పుడు శరణార్థుల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నది. మెక్సికో నుంచి సరహద్దు దాటి, దేశంలోకి ప్రవేశించిన చిన్నారులను సైతం అధికారులు విడిచిపెట్టకపోవడం తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. చిన్నారులను వారివారి తల్లిదండ్రులు, సంరక్షకుల నుంచి దూరం చేయడం మానవత్వానికి మాయని మచ్చగా అమెరికాలోని సామాజిక కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నవనీత్ కౌర్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.