జాతీయ వార్తలు

2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/జైపూర్, జూలై 21: వచ్చే నాలుగేళ్లలో 2022 నాటికి దేశంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే విధంగా బృహత్తర ప్రణాళిక అమలుతో బీజేపీ సర్కార్ ముందుకెళుతోందని, ఈ అంశంపై అనుమానాలు అక్కర్లేదని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు రైతాంగానికి తాము చేస్తున్న మేలును చూసి ఓర్వలేక దుష్ప్రచారం చేస్తున్నాయని, వారి మాటలను రైతులు పట్టించుకోరన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీని విమర్శించడం విపక్షాలకు అలవాటైందన్నారు. ప్రతిపక్ష పార్టీలకు పనీపాటా లేదని, ప్రతి అభివృద్ధి పథకాన్ని విమర్శిస్తూ కాలక్షేపం చేస్తున్నారన్నారు. వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో బీమా రంగం పాత్ర అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిందన్నారు. రైతులకు వౌలికసదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని, దీని వల్ల వారి ఆదాయం రెట్టింపు అవుతుందన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చాలా సంవత్సరాల పాటు వ్యవసాయం గురించి మాట్లాడడమే కాని, సంస్కరణలకు ఎవరూ ప్రయత్నించలేదన్నారు. ప్రస్తుతం రైతాంగ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు ఉమ్మడిగా పనిచేస్తున్నాయన్నారు. రైతుకు మేలు చేస్తామంటుంటే, ఇవన్నీ రాజకీయ ప్రకటనలంటూ విపక్షాలు హేళన చేయడం తగదన్నారు. 2022 నాటికి దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలవుతుందని, ఆ సంవత్సరం నాటికి రైతులకు ఆదాయాన్ని రెట్టింపు చేసే విధంగా అనేక పథకాల అమలుకు శ్రీకారం చుట్టామన్నారు. రైతుల మేలు కోసం వచ్చే ఖరీఫ్‌లో పంట ఉత్పత్తుల కనీస గిట్టుబాటుధరలను పెంచామన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వ్యవసాయంలో సంస్కరణలు వేగవంతమవుతున్నాయన్నారు.