అక్షర

తనదను స్వరంలో తన్మయత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనుస్వరం- అనువాద కవిత్వం:
రచయిత- నాగరాజు రామస్వామి;
122 పేజీలు, వెల-రూ.100
9100226904
అన్ని ప్రధాన పుస్తకాల షాపుల్లో లభ్యం.

ఇరవై తొమ్మిది మంది స్వదేశీ, విదేశీ కవుల 57 ప్రసిద్ధ కవితలను నాగరాజు రామస్వామిగారు తెలుగులోకి ‘అనుస్వరం’గా అనువదించడం హర్షణీయం. ఆంగ్ల, సంస్కృతాంధ్ర భాషలలో అనువాదకునికి ఉన్న పాండితీ గరిమ, ప్రతిభాపాటవాలు ఈ అనువాద సంపుటిలో స్పష్టంగా కనిపిస్తాయి.
రవీంద్రుడు, అరవిందుడు, సరోజినీనాయుడు, సుబ్రహ్మణ్యభారతి, జీబనానందదాస్, కీట్స్, వర్డ్స్‌వర్త్, బ్రౌనింగ్, బాదవేర్, ఈట్స్, పాబ్లొ, నెరుడా, పుష్కిన్, షాన్‌హాన్, మాయాఏంజిలోవ్, గాబ్రియేల్ మిస్రాల్, సొయింకా, ఎలియట్ లాంటి ప్రసిద్ధ కవుల కవితల సరసన తాను ముచ్చటపడిన తన మనుమడి కవితను తెలుగులోకి అనువదించి ఈ సంపుటిలో చేర్చారీ కవి.
అరుణారుణ జ్వలిత అరవిందం, దిగ్భ్రాంతిత వేసవి సాయంత్రాలు, విహ్వల విస్మిత ఉత్కళికల వలయ శ్రేణి, దైత్యావేశ పరవశతృష్ణ, చెట్లురాల్చిన ద్రవకాంతి, భయదశీతర్తు హిమవాస్తవ భీతి, తుహినరేకు తునక, వౌక్తిక మలాము, అనశ్వర జీవన స్పృహ, దత్త-దామ్యత- దయధ్వం లాంటి పదబంధాలు, సమాసాలు- అనువాదాలకు చక్కని సొగసులద్దినాయి.
‘ఎదత్వదీయ గానాగ్ని యందెదిగి ఎగసి’-అనే స్వేచ్ఛానువాద తేటగీతి రవీంద్రుని కవితకు చక్కని అనువాదం.
శిశిరానికి ముందు వస్తుంది (Prewinter) కాబోలు Autumn (ఆకురాలు కాలం, శరత్కాలం-నిఘంటు అర్థం)కు హేమంతమని పేరిడినారు. బంగ్లాదేశ్ జాతీయపక్షి ‘డోయెల్’- Magpie Robin ను ‘కొంఢకోకిల’ అని, Daffodialsను ‘వనజాజులు’గా, Urn ను ‘శిలాకలశం’గా, Angel ను ‘అఫ్సరస’గా ఇలా విలక్షణంగా అనువాదం చేసినారు.
అనేక మంచి అనువాద కవితలున్న ఈ కవితా సంపుటికి చక్కగా అమరిన ముఖ చిత్రంలో తెల్లటి పుష్పం అందాలను విరజిమ్ముతుండగా, దాని ప్రతిబింబం నీటి అలల్లో కనిపిస్తున్నతీరు ఈ అనువాద సంపుటిలోని ఉదాత్తతానుదాత్తతలను సింబాలిక్‌గా చెప్పకనే చెబుతున్నది.

-డా.లంకా శివరామప్రసాద్