బిజినెస్

వచ్చే పదేళ్లలో 11,210 మెగావాట్ల అదనపు విద్యుదుత్పత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 26: వచ్చే పదేళ్లలో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని రూ. 64,182కోట్లతో 11,210 మెగావాట్ల అదనపు విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌కో సిఎండి కె విజయానంద్ తెలిపారు. రాష్ట్రంలో మిగులు విద్యుత్, అందరికీ విద్యుత్ లక్ష్యంగా ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. మంగళవారం ఇక్కడ విద్యుత్ సౌధలో 67వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. సమాచార టెక్నాలజీతో విద్యుదుత్పత్తి, సరఫరా, పంపిణీని పర్యవేక్షిస్తున్నామన్నారు. ఏపి జెన్కోలోని అన్ని విద్యుత్ ప్లాంట్లు 85 నుంచి 90 శాతం వరకు ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్‌ను సాధిస్తున్నాయని తెలిపారు. విద్యుత్ రంగంలో పంపిణీ నష్టాలు 13.24 శాతం నుంచి 10.30 శాతానికి తగ్గాయని, ఈ ఏడాది 9 శాతం వరకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఇది సాధ్యమైతే సాలీనా 375 కోట్ల రూపాయల మేర విద్యుత్ ఆదా అవుతుందని పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం 150 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి అవుతోందని, త్వరలో 3,500 మెగావాట్ల కెపాసిటీ ఉన్న మూడు సౌర పార్కులను విద్యుదుత్పత్తి చేసేందుకు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. వచ్చే నాలుగేళ్లలో ఐదు వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తామని, 12వ పంచవర్ష ప్రణాళికలో 5,258 మెగావాట్ల పవన విద్యుత్ ఉత్పత్తి అవుతుందని తెలిపారు. గ్రీన్ ఎనర్జీ కారిడార్ కింద 3,150 మెగావాట్ల పవన విద్యుత్‌ను పంపిణీ వ్యవస్థకు చేరవేసేలా 400 కెవి సబ్‌స్టేషన్లు మూడు, 220 కెవి సబ్‌స్టేషన్లు 8 నిర్మిస్తామన్నారు. ఇందులో భాగంగా మొదటి దశలో రెండు వేల మెగావాట్ల విద్యుత్ పంపిణీకి రూ. 2,085.41 కోట్ల నిధులను ఆర్‌ఇసి మంజూరు చేసిందన్నారు.

విద్యుత్ సౌధలో మాట్లాడుతున్న విజయానంద్