ఆంధ్రప్రదేశ్‌

సీఎం దీక్షకు మద్దతుగా జిల్లాల్లో మంత్రుల నిరశనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు తదితర అంశాలపై కేంద్రం వైఖరిని నిరసిస్తూ, విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన ధర్మపోరాట దీక్షకు మద్దతుగా జిల్లాల్లో మంత్రులు కూడా నిరసన దీక్షలు చేపట్టారు. ఉప ముఖ్యమంత్రి (హోం) చినరాజప్ప కాకినాడలోని సర్పవరం జంక్షన్, బాలాజీ చెరువులో ఏర్పాటు చేసిన నిరశన దీక్షలో పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) కేఈ కృష్ణమూర్తి కర్నూలులో దీక్షలో పాల్గొన్నారు. పర్యాటక శాఖ మంత్రి అఖిల ప్రియ కూడా ఈ దీక్షలో పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెంకటాచలంలో ఏర్పాటు చేసిన దీక్షలో పాల్గొన్నారు. నెల్లూరులోని ఆత్మకూరు బస్టాండ్ వద్ద పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన దీక్షలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. చిత్తూరులో గాంధీ జంక్షన్‌లో ఏర్పాటు చేసిన దీక్షలో మంత్రి అమరనాథ్ రెడ్డి పాల్గొన్నారు. శ్రీకాకుళం పట్టణంలో జరిగిన దీక్షలో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. గుంటూరులో హిందూ కళాశాల సెంటర్‌లో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు దీక్షలో పాల్గొన్నారు. అనంతపురంలో టవర్ క్లాక్ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన దీక్షల్లో మంత్రులు కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత పాల్గొన్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో మంత్రి అయ్యన్నపాడు దీక్షలో పాల్గొన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన దీక్ష శిబిరంలో మంత్రి గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా అద్దంకి బస్‌స్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో మంత్రి శిద్ధా రాఘవరావు పాల్గొన్నారు. విజయనగరంలో కోట సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన దీక్ష శిబిరంలో మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు పాల్గొన్నారు. కడపలో మంత్రి ఆదినారాయణ రెడ్డి, పశ్చిమ గోదావరిలో మంత్రి జవహర్ పాల్గొన్నారు.