ఆంధ్రప్రదేశ్‌

మేము సైతం దీక్షాబద్ధులం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం/శ్రీకాకుళం, ఏప్రిల్ 20: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన ‘్ధర్మ పోరాట దీక్ష’తో ఢిల్లీ దిగిరాల్సిందేనని మానవ వనరులు శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ‘్ధర్మపోరాట దీక్ష’కు సంఘీభావంగా జిల్లావ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో శుక్రవారం దీక్షలు చేపట్టారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ ఆధ్వర్యంలో విశాఖ నగరంలో జరిగిన ధర్మపోరాట దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రానికి న్యాయబద్దంగా రావాల్సిన హక్కులు ఇవ్వాలని కోరితే కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించడం వల్లే ముఖ్యమంత్రి కఠిన నిర్ణయాలు తీసుకునేలా చేసిందన్నారు.. పార్లమెంట్ సమావేశాల్లో టీడీపీ అనుసరించిన పోరాటం, ఢిల్లీలో ప్రధాని నివాసం ఎదుట ఎంపీల ధర్నా వంటి అంశాలు బీజేపీని ఇరుకున పెట్టాయన్నారు. రాష్ట్ర హక్కుల కోసం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి పార్లమెంట్ సెంట్రల్ హాల్‌ను సందర్శిస్తే దేశవ్యాప్తంగా బీజేపీయేతర పక్షాలు సంఘీభావం తెలిపాయన్నారు. ఈ అంశం ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వాన్ని కుదిపేసిందన్నారు. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీని ఎదుర్కొనడం పెద్ద లెక్క కాదన్నారు. ఇప్పటికైనా రాష్ట్రంలోని బీజేపీ నాయకత్వం కేంద్రంలో తమ అధిష్ఠానాన్ని ఒప్పించి ప్రత్యేక హోదా సహ విభజన హామీలన్నింటినీ అమలు చేసేలా ఒత్తిడి తేవాలని సూచించారు. అవసరమైతే తాము ఢిల్లీలో దీక్ష చేసేందుకు సైతం వెనుకాడేది లేదన్నారు. అంతకు ముందు ఆయన భీమిలి నియోజకవర్గం తగరపువలస, ఎయూలో తెలుగునాడు విద్యార్థి విభాగం చేస్తున్న సంఘీభావ దీక్షల్లో పాల్గొని సంఘీభావం తెలిపారు. కాగా శుక్రవారం శ్రీకాకుళం నగరంలోని ఏడురోడ్ల కూడలిలో ముఖ్యమంత్రి చంద్రబాబు దీక్షకు సంఘీభావంగా మంత్రి అచ్చెన్న దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా అచ్చెన్న మాట్లాడుతూ చంద్రబాబు 420 అని వైసీపీ నేత జగన్మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించడంపై తీవ్రంగా మండిపడ్డారు. రాజకీయాలపై అవగాహన లేని పిల్ల నాయకుడు లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రజాదరణ పొందాలని అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారని జగన్‌పై ఎద్దేవా చేశారు.నాడు కాంగ్రెస్ పెద్దలు ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామంటే విపక్షంలో ఉన్న బీజేపీ పదేళ్లు హోదా ఇస్తామని హామీ ఇచ్చి నేడు మాటమార్చడం విచారకరమన్నారు.
వెంకయ్య రాజీనామా చేయాలి
రాజమహేంద్రవరం: ప్రత్యేక హోదా సాధనలో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి పన్నులు కట్టకుండా సహాయ నిరాకరణచేస్తే తప్పకుండా దిగొస్తుందని, చిత్తశుద్ధితో కూడిన ఉద్యమం అంటే ఆ విధంగా చేయాలని విప్లవ చిత్రాల హీరో, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి అన్నారు. హోదా కోసం ఉపరాష్టప్రతి వెంకయ్యనాయుడు తన పదవికి రాజీనామా చేసి బయటకొచ్చి ఆంధ్రుడని నిరూపించుకోవాడానికి ఇదే సరైన సమయమన్నారు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సుబ్రహ్మణ్య మైదానంలో శుక్రవారం రాత్రి జరిగిన ప్రత్యేక హోదా ఆత్మగౌరవ మహాసభలో ఆయన మాట్లాడారు. నిజంగా ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధి వుంటే వైసీపీ, టీడీపీ ఒకరినొకరు తిట్టుకోకుండా ఒకే వేదికపైకి రావాలన్నారు. పవన్‌కళ్యాణ్ కాకినాడ సభలో ప్యాకేజీ పాచిపోయిన లడ్డూ అని, హోదా కావాలని అనడమే అసలైన టైమింగ్ అన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ చంద్రబాబునాయుడు పశ్చాత్తాప పోరాటం చేయాలన్నారు. 24న రాష్టమ్రంతా బ్లాక్ డే పాటించాలని, స్వచ్ఛంధంగా రాత్రి ఏడు గంటల నుంచి ఏడున్నర గంటల వరకు విద్యుత్‌ను నిలుపుదల చేసి చీకటిలో గడిపి నిరసన తెలియజేయాలని పిలునిచ్చారు. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్రం మనలో మనకు విభేధాలు సృష్టించడానికి ప్రయత్నిస్తోందని, అందరూ కలిసి పోరాటం చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ మాట్లాడుతూ రాష్ట్రం నుంచి ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లా నుంచి వెళ్ళే చమురు, సహజ వాయు సరఫరాను అడ్డుకుంటే కేంద్రం దిగొస్తుందన్నారు. తూర్పు గోదావరి జిల్లా నుంచి వెళ్ళే చమురు, సహజ వాయు నిక్షేపాలను అడ్డుకుంటామని, రైళ్ళను ఆపుతామని, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఒక్క రోజైనా దిగ్భంధనం చేస్తామనే పిలుపు ఇచ్చే దైర్యం టీడీపీ, వైసీపీలకు వుందా అని సవాల్ చేస్తున్నానన్నారు. దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ హోదా కోసం అందరూ కలిసి పోరాటం చేయాలన్నారు. మాజీ మంత్రి వసంత నాగేశ్వరావు, హీరో సంపూర్ణేశ్‌బాబు, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ మాట్లాడారు.
కేంద్రం మెడలు వంచుతాం..
ఏలూరు/కాకినాడ: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామని ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, పితాని సత్యనారాయణ, కెఎస్ జవహర్ స్పష్టం చేశారు. అవసరమైతే ప్రజలతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసి, కేంద్రం మెడలు వంచుతామన్నారు. తన జన్మదినాన రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన ధర్మ పోరాట దీక్షకు సంఘీభావంగా తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల వ్యాప్తంగా శుక్రవారం నిరసన దీక్షలు మిన్నంటాయి. ప్రతీచోటా స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో నిరసన దీక్షలు నిర్వహించారు. కాకినాడలో సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన దీక్ష శిబిరాన్ని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రారంభించారు. కాకినాడ ఎంపీ తోట నరసింహం మాట్లాడుతూ పార్లమెంట్‌లో టీడీపీకి చెందిన ఎంపీలు కలిసికట్టుగా పోరాటం చేసినా చర్చించుకుండా ప్రభుత్వం పారిపోయిందన్నారు. ఏలూరులో ఎమ్మెల్యే బడేటి కోట రామారావు ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద దీక్షా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ, ఎక్సైజ్ శాఖ మంత్రి కె ఎస్ జవహర్, రాజ్యసభ సభ్యురాలు, పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి, ఎంపీ మాగంటి బాబు, నగర మేయర్ షేక్ నూర్జహాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువచ్చి తీరతామని చెప్పారు.
జ్వరం, గాయాలతోనే స్పీకర్ నిరశన
నరసరావుపేట: చంద్రబాబునాయుడు విజయవాడలో చేసిన ధర్మపోరాట దీక్షకు మద్దతుగా స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు గుంటూరు జిల్లా నరసరావుపేటలోని మున్సిపల్ కార్యాలయం వద్ద దీక్షలో పాల్గొన్నారు. జ్వరం, సైకిల్‌పై నుంచి పడిన గాయాలను కూడా లెక్కచేయకుండా చేతికి సెలైన్ బాటిల్‌తోనే అంబులెన్స్‌లో శుక్రవారం ఉదయం పది గంటలకు దీక్షాస్థలి వద్దకు చేరుకున్నారు. ఆరోగ్యం బాగా లేకపోవడంతో వైద్యులు నిరంతరం పర్యవేక్షించారు. ఆర్డీవో గంధం రవీందర్ మాట్లాడుతూ స్పీకర్ ఆరోగ్యం బాగులేదు కనుక, ఎండ ఎక్కువగా ఉండడంతో తామందరం ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని దీక్షను విరమింప చేయాలని కోరుతున్నామని తెలిపారు. దీంతో స్పీకర్ 12 గంటలకు దీక్ష విరమించారు.
హోరెత్తిన ధర్మపోరాట దీక్షలు
నెల్లూరు/ఒంగోలు/తిరుపతి/చిత్తూరు: రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు అంటూ సిఎం చంద్రబాబు నాయుడు చేపట్టిన దీక్షకు సంఘీభావంగా నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో మంత్రులు ధర్మపోరాట దీక్షలు చేపట్టారు. నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ వద్ద దీక్షలో మంత్రి నారాయణ, వెంకటాచలంలో మంత్రి సోమిరెడ్డి కూర్చొనగా, ఒంగోలులో మంత్రి శిద్దా రాఘవరావు, చిత్తూరులో మంత్రి అమర్‌నాథరెడ్డి పాల్గొన్నారు. కాగా చిత్తూరు ఎంపి శివప్రసాద్ ఆరుచోట్ల వివిధ వేషాలతో దీక్షలో పాల్గొన్నారు. జిల్లాకేంద్రమైన ఒంగోలులోని అద్దంకి బస్టాండు సెంటరులో ఎన్టీఆర్ విగ్రహం వద్ద జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ సారథ్యంలో ధర్మపోరాట దీక్ష జరిగింది. అటవీశాఖమంత్రి శిద్దా రాఘవరావు, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. దీక్షా శిబిరం వద్దకు ఆయా సంఘాల నాయకులు వచ్చి సంఘీభావం ప్రకటించారు.
ప్రత్యేక హోదాతోపాటు విభజన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం విజయవాడలో చేపట్టిన ధర్మ పోరాట దీక్షకు సంఘీభావంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాలలో టీడీపీ శ్రేణులు ఒక రోజు దీక్షా కార్యక్రమం చేపట్టారు. నగరంలో చేపట్టిన దీక్షలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పాల్గొని మాట్లాడుతూ విభజన హామీలన్నీ అమలుచేస్తామని ప్రకటించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హామీలను నెరవేర్చడంలో విఫలం చెందారని ఆరోపించారు. సర్వేపల్లి నియోజకవర్గ కేంద్రమైన వెంకటాచలంలో చేపట్టిన దీక్షలో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను బీజేపీ మోసం చేసిందన్నారు. కాగా రాష్ట్రానికి న్యాయం చేయాల్సిందే అనే నినాదంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తలపెట్టిన ధర్మ పోరాట దీక్షకు సంఘీభావంగా చిత్తూరు నగరంలో మంత్రి అమరనాధరెడ్డి ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టారు. ముందుగా మంత్రితోపాటు పలువురు నేతలు, పార్టీ కార్యకర్తలు గాంధీ, రామారావు, జ్యోతీరావుపూలే విగ్రహాలకు పూలమాల వేశారు. స్థానిక గాంధీ విగ్రహం వద్ద దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా కాగా చిత్తూరు ఎంపీ శివప్రసాద్ చిత్తూరులో భీముడి వేషంలోనూ పూతలపట్టులో దోబీ వేషంలోనూ, మరోచోట హరిశ్చంద్రుడు వేషంలోనూ ఇలా ఆరు ప్రాంతాల్లో వివిధ వేషాల్లో దర్శనమిచ్చి అక్కడ దీక్షల్లో కొద్దిసేపు పాల్గొన్నారు.
రాయలసీమలో దీక్షా శిబిరాలు
కర్నూలు/కడప/అనంతపురం: చంద్రబాబు శుక్రవారం విజయవాడలో చేపట్టిన ధర్మ పోరాట దీక్షకు సంఘీభావంగా కర్నూలు జిల్లాలో టీడీపీ శ్రేణులు దీక్షలు చేపట్టాయి. కర్నూలులో ఉప ముఖ్యమంత్రి కెయి.కృష్ణమూర్తి, జడ్పీచైర్మన్ రాజశేఖర్, ఆళ్లగడ్డలో మంత్రి అఖిలప్రియ, ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు దీక్షల్లో పాల్గొన్నారు. పలు దీక్షా శిబిరాలను ఉప ముఖ్యమంత్రి కృష్ణమూర్తి, శాసన మండలి చైర్మన్ ఫరూక్, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్, లోక్‌సభ సభ్యురాలు బుట్టా రేణుక, టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు సందర్శించి మద్దతు తెలిపారు. అనంతపురంలో టీడీపీ శ్రేణులు దీక్షలు చేపట్టాయి. అనంతపురం నగరంలోని టవర్‌క్లాక్ వద్ద మంత్రులు కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత, ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకరచౌదరి, స్థానిక నేతలు, పార్టీ శ్రేణులు దీక్షల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ఏపీ ఉజ్వల భవిష్యత్ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు చూపుతున్న నిబద్ధత, అంకితభావాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయవాడలో చేపట్టిన ధర్మ పోరాట దీక్షకు సంఘీభావంగా కడప జిల్లాలో పార్టీ నేతలు శుక్రవారం దీక్షలు చేపట్టారు. కడప నగరంలో మంత్రి ఆదినారాయణరెడ్డి, రాజంపేటలో విప్ మేడా మల్లికార్జునరెడ్డి దీక్షల్లో పాల్గొన్నారు. జిల్లాలోని బద్వేలు, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో నేతలు వేర్వేరు శిబిరాలు ఏర్పాటు చేశారు. పలు చోట్ల ఓ వర్గం దీక్షలుచేపట్టగా మరో వర్గం ఆ ఛాయలకు సైతం వెల్లకోవడం గమనార్హం. దీంతో జిల్లా టీడీపీలో నెలకొన్న విభేదాలు మరోసారి బహిర్గతమైనట్టయింది. కడప దీక్ష శిబిరంలో మంత్రి ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుంటే ప్రధాని మోదీ తీవ్రంగా నష్టపోతారని అన్నారు. తెలుగు రాష్ట్రానికి బీజేపీ చేస్తున్న ద్రోహాన్ని ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగువారు సైతం గ్రహించాలన్నారు. ఈదీక్షల అనంతరమైనా కేంద్రం స్పందించాలన్నారు.

చిత్రాలు...నంతపురంలో దీక్షా శిబిరంలో మంత్రులు కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత
*చిత్తూరులో భీముని వేషంలో అలరిస్తున్న ఎంపీ శివప్రసాద్