ఆంధ్రప్రదేశ్‌

ఇంగిత జ్ఞానంతో అలోచించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(బెంజిసర్కిల్), ఏప్రిల్ 20: ఈ పోరాటం పార్టీ కోసమో, వ్యక్తిగత స్వర్థం కోసమో కాదని, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం జరుగుతున్న ఈ సంగ్రామాన్ని వ్యక్తిగతంగా చూడవద్దని సినీ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సూచించారు. విజయవాడలోని మున్సిపల్ మైదానంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం నిర్వహించిన ధర్మపోరాట దీక్షకు సంఘీభావం తెలిపిన భరద్వాజ మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి చేస్తున్న ఈ దీక్షకు తాను పూర్తిగా మద్దతు ప్రకటించడంతో పాటు అభినందనలు తెలుపుతున్నట్లు ప్రకటించారు. చంద్రబాబుని నమ్మబోమని కొందరు వ్యాఖ్యానిస్తున్నారని, ఇది సరైనది కాదన్నారు. ఈ రోజు చంద్రబాబు నిర్వహిస్తున్న ఈ దీక్ష, టీడీపీ కోసమా, చంద్రబాబు కోసమా అనేది అలోచించాలన్నారు. ఈ దీక్ష రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు అవసరమైందా, కాదా అని కాస్త ఇంగిత జ్ఞానంతో అలోచించాలన్నారు. రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం చంద్రబాబు పోరాటం చేస్తున్నారని, మధ్యలో పోరాటాన్ని ఆపేస్తే రాష్ట్ర ద్రోహిగా మిగులుతారని అభిప్రాయపడ్డారు. ఈపరిస్థితుల్లో ఆయన పోరాటానికి ప్రతీ ఒక్కరూ మద్దతు ఇవ్వాలని సూచించారు. ఒక్కొక్కరు ఒక్కొ కుంపటి పెట్టుకుని, ఆ కుంపట్లో కూర్చొని ఏదేదో మాట్లాడుతూ పోతే రాష్ట్రానికి న్యాయం జరిగే పరిస్థితి ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.