ఆంధ్రప్రదేశ్‌

అంగన్‌వాడీ కేంద్రాల్లో బయోమెట్రిక్ వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 21: రాష్ట్రంలోని అంగన్‌వాడీ కార్యకర్తలందరూ తమకు సమీపంలోని ప్రభుత్వ పాఠశాలల్లో బయోమెట్రిక్ హాజరు వేయించుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడాన్ని నిరసిస్తూ ఏఐటీయూసీ అనుబంధ ఆంధ్రప్రదేశ్ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాలు, ఇతర కార్యాలయాల వద్ద పెద్దఎత్తున ధర్నాలు జరిగాయి. సంఘ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఆర్.రవీంద్రనాధ్ నాయకత్వంలో ఇబ్రహీంపట్నంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కడప కలెక్టరేట్ ఎదుట ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలకు అంగన్‌వాడీ కేంద్రాలు చాలా దూరంలో ఉన్నాయని ముఖ్యంగా గ్రామాల్లో ఇంటర్నెట్ సక్రమంగా పనిచేయటం లేదన్నారు. అసలు దీనివల్ల అదనపు శ్రమ, అదనపు ఖర్చు కాకుండా ప్రీ స్కూల్ విధానం దెబ్బతింటుందన్నారు. ఇప్పటికే పనిభారం పెరిగి సతమతమవుతున్నారన్నారు. మండుటెండలో మూడు గంటల వరకు విధులు నిర్వర్తించి తమ ఇళ్లకు వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నారని వడదెబ్బకు గురవుతున్నారని అన్నారు.