ఆంధ్రప్రదేశ్‌

గ్రాట్యుటీ, కుటుంబ పింఛన్‌పై మార్గదర్శకాలు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 21: రాష్ట్రంలోని లక్షా 85వేల మంది ఉద్యోగులకు లాభం చేకూరేలా రాష్ట్ర ప్రభుత్వం తొలుత గ్రాట్యుటీ కోసం 2017 జూన్ 19న, అలాగే మృతుల కుటుంబాలకు ఫ్యామిలీ పింఛన్ సదుపాయం కల్పిస్తూ 2017 జూలై 18న విడుదల చేసిన 107, 122 జీవోల అమలుకు ఎట్టకేలకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఇంతకాలం మార్గదర్శకాలు విడుదల చేయకపోవడంతో చనిపోయిన కుటుంబాలకు లబ్ధి చేకూరడంలో జాప్యం కల్గింది. ఇటువంటి స్థితిలో చనిపోయిన కుటుంబాలకు ఆర్థిక చేయూత చేకూర్చడానికి ఏపీ జేఏసీ అమరావతి, ఏపీ సీపీఎస్ ఎంప్లారుూస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనేక పర్యాయాలు ఉన్నతాధికారులకు, మంత్రులకు విన్నవించారు. ఇందులో భాగంగా గత ఫిబ్రవరి 4న ట్రెజరీల ముందు ధర్మయుద్ధం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఒకరోజు ధర్నాలు చేశారు. ఆ తరువాత ఫిబ్రవరి 14, 15 తేదీల్లో డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ అధికారి మోహనరావుని కలిసి వినతిపత్రాలివ్వడం, ఫిబ్రవరి 15న ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీని కలిసి జీవోల్లో ఉన్న లోపాలను సవరించి మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలని వినతిపత్రాలు సమర్పించారు. మొత్తంపై ప్రభుత్వం నేడు విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో సీపీఎస్ రిటైర్మెంట్ ఉద్యోగులకు సర్వీస్ గ్రాట్యుటీ, విధి చిన్నచూపుచూసి ఆకస్మిక మరణం చెందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు డెత్ గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ లభించనుంది. ఫ్యామిలీ పెన్షన్ పొందాలంటే ఉద్యోగి చనిపోయినప్పటికీ ఉద్యోగి సొంత ఖాతాలో ఎంత డబ్బు ఉంటుందో అంత ఖాతాకు జమచేయాలని, ఆ డబ్బును ఏ హెడ్ ఆఫ్ అకౌంట్‌లో జమ చేయాలో పై జీవో ద్వారా స్పష్టం చేశారు. అటెండర్, ఆ కిందిస్థాయి వారికి ఆయా జిల్లాల్లోని లోకల్ ఫండ్ కార్యాలయం అధికారుల ద్వారా, ఆ పైస్థాయి వారికి ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ద్వారా పైన తెలిపిన డెత్ కమ్ రిటైర్మెంట్ గ్రాట్యుటీ, కుటుంబ పింఛన్లు సీపీఎస్ ఉద్యోగులకు మంజూరవుతాయన్నారు. 2004 సెప్టెంబర్ 1 నుండి ఇప్పటివరకు చనిపోయిన మొత్తం 283 మందికి వెంటనే లబ్ధి చేకూరుతుంది. ప్రభుత్వంపై గ్రాట్యుటీ రూపేణా సుమారు 10 కోట్ల భారం పడనుంది. ఇప్పటికే దాదాపు 94 మందికి కుటుంబ పింఛన్ ఉత్తర్వులు ఏజీ నుండి చనిపోయిన కుటుంబ సభ్యులకు అందించారు.