ఆంధ్రప్రదేశ్‌

25 నుంచి మద్యం కొనుగోళ్ళ నిలిపివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఏప్రిల్ 21: ప్రభుత్వం ఇస్తున్న ట్రేడింగ్ మార్జిన్ 18శాతానికి పెంచాలని డిమాండు చేస్తూ ఈనెల 25 నుంచి డిపోల నుంచి మద్యం కొనుగోళ్ళు నిలిపివేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వైన్ డీలర్ల అసోసియేషన్ ప్రకటించింది. తమ హెచ్చరికకు ప్రభుత్వం దిగి రాకుంటే ఆందోళన ఉద్ధృతం చేయాలని నిర్ణయించింది. ఈమేరకు రాష్ట్రంలోని 13జిల్లాలకు చెందిన మద్యం డీలర్లు శనివారం విజయవాడలో అత్యవసర సమావేశం నిర్వహించారు. మద్యం కొనుగోళ్ళ నిలిపివేత ద్వారా తమ ప్రధాన సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని దీనిలో భాగంగా ఎక్సైజ్ మంత్రిని కలువనున్నట్లు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాయల సుబ్బారావు తెలిపారు. లైసెన్స్ ఫీజు తగ్గించామనే కారణం చెబుతూ 21శాతంగా ఉన్న కమీషన్‌ను ఒక్కసారిగా 10శాతానికి తగ్గించడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నట్లు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సుబ్బారావు మాట్లాడుతూ ట్రేడ్ మార్జిన్ పెంపుపై నెలన్నర క్రితం కడప, అనంతపురం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో మద్యం షాపులన్నీ మూతపడ్డాయన్నారు. ఈ సమయంలో ఎక్సైజ్ శాఖామంత్రి కెఎస్ జవహర్ తమ అసోసియేషన్‌తో చర్చించి న్యాయం చేస్తామని ఇచ్చిన హామీ ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదన్నారు. దీంతో రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా మద్యం డిపోల నుంచి కొనుగోళ్ళను నిలిపివేయాలని నిర్ణయం తీసుకోక తప్పలేదన్నారు. దీనివల్ల రాష్ట్రానికి ఆర్థికంగా నష్టమైనప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మద్యం షాపుల యజమానులు, బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులు మద్యం స్టాకు ఉన్నంతవరకు అమ్మకాలు సాగిస్తారని, ఆ తర్వాత కూడా స్టాకు లేకున్నా షాపులు తెరిచి ఉంచి నిరసన తెలియచేస్తామన్నారు.
గత ఏడాది మద్యం షాపుల కేటాయింపుపై ప్రభుత్వానికి, లైసెన్సీకి జరిగిన ఒప్పందానికి విరుద్ధంగా కమీషన్ కోత విధించే అధికారం ఎవరికీ లేదన్నారు. అగ్రిమెంటు అమల్లోకి వచ్చిన తర్వాత ఒక పార్టీ ప్రయోజనాలకు విరుద్ధంగా నిబంధనలను సవరించడం చెల్లదని సుప్రీం కోర్టు పలు తీర్పుల్లో చెప్పినా ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందన్నారు. దీనిపై తాము హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని, విచారణలో దశలో ఉన్నందున ఈలోగా ప్రభుత్వం ట్రేడ్ మార్జిన్ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటే కేసును విత్‌డ్రా చేసుకుంటామని చెప్పారు. దీంతోపాటు 2017-18 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం వ్యాపారులకు చెల్లించాల్సిన రూ.3,300 కోట్లను వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ప్రభుత్వానికి 18శాతం కమీషన్ ఇవ్వడం భారమైతే కనీసం 16శాతం ఇచ్చినా సమ్మతమేనన్నారు.