ఆంధ్రప్రదేశ్‌

టీటీడీ పాలకమండలి నియామకాలపై వివాదాల ముసురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 21: ఏడాది తరువాత ఆలస్యంగా ప్రభుత్వం నియమించిన టీటీడీ పాలకమండలిని వివాదాల సుడిగుండం చుట్టుముట్టింది. 13 మంది బోర్డు సభ్యుల నియామకంలో విశాఖపట్నం జిల్లా పాయకరావు పేట ఎమ్మెల్యే అనిత పేరు ఉండటం దుమారం లేపింది. అందుకు ప్రధాన కారణం అనిత ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను క్రైస్తవ మతస్థురాలినని, తన బ్యాగులో,కారులో ఎప్పుడు బైబిల్ గ్రంథం ఉంటుందని చెప్పుకుంది. ఈ అంశమే నేడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వివాదాలు ముసిరేలా చేసింది. స్వయంగా తాను క్రైస్తవ మతస్థురాలినని చెప్పుకున్నా, ప్రపంచంలోనే అతి పెద్ద హైంధవ ధార్మిక సంస్థలో ఆమెను సభ్యురాలిగా ఎలా నియమిస్తారన్నదే నేడు హైందవలోకం కనె్నర్ర చేయడానికి కారణమైంది. ఆమె బయోడేటాను చూసుకోకుండా ముఖ్యమంత్రి ఆమె పేరును టీటీడీ పాలకమండలి సభ్యుల జాబితాలో ఎలా చేరుస్తారని బీజేపీ, వీహెచ్‌పితోపాటుగా రాయలసీమ పోరాట సమితీ నేతలు ప్రశ్నిస్తున్నారు. తక్షణం ఆమె పేరును టీటీడీ పాలక మండలి జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నారావారి దేవస్థానంగా మార్చేస్తున్నారని ధ్వజమెత్తారు. తక్షణం ఆమె పేరును తొలగించకపోతే పాలకమండలి ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ అధికార దర్పంతో తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామితో చెలగాటమాడితే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో గత అనుభవాలను చంద్రబాబు గుర్తుకు తెచ్చుకోవాలని హెచ్చరించారు. పాలకమండలి నియామకంపై తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించి తన పోరాటం సాగిస్తాన్నారు. పాలకమండలి సభ్యుల్లో నేరచరిత్ర ఉన్నవారుకూడా ఉన్నారన్నారు. బోర్డును రద్దు చేసి ఆధ్యాత్మిక చింతన, సేవాభావం ఉన్నవారితో బోర్డు నియమించాలన్నారు.