ఆంధ్రప్రదేశ్‌

టీడీపీకి చుక్కలు చూపిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 21: బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబునాయుడుకు అలిపిరి తర్వాత ఏం జరిగిందో ఈసారీ అదే గతి పట్టనుందన్నారు. టీడీపీకి బీజేపీ చుక్కలు చూపించనుందని హెచ్చరించారు. రాజమండ్రి ప్రెస్‌క్లబ్‌లో శనివారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బావ కళ్లల్లో ఆనందం చూడటం కోసం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రధాని మోదీపై నోటికొచ్చినట్టు మాట్లాడారని, ఇది చూస్తున్న చంద్రబాబు ఆనందించారని, అందుకే చంద్రబాబునాయుడును సాక్షిగా పేర్కొంటూ బాలకృష్ణపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నామని చెప్పారు. ఈ మేరకు మీడియా సమావేశం అనంతరం సాయంత్రం రాజమహేంద్రవరం ఎస్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే బాలకృష్ణపై సోము వీర్రాజు ఫిర్యాదు కాపీని ఎస్పీ రాజ్‌కుమారికి అందించనున్నట్టు విలేఖరులకు సమాచారాన్ని అందించారు. పరిస్థితులు బాగుండకపోతే లయతప్పి మాట్లాడతారని, పరిస్థితులు బాగుండకే అప్పట్లో ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ పెట్టారన్నారు. పరిస్థితి బాగుండకే చంద్రబాబునాయుడుకు 2004లో అలిపిరి కనబడిందన్నారు. 2019లో కూడా అలాంటిదే కనబడనుందని, 2004లో ఏమైందో అలాంటిదే 2019లో కూడా అదే జరగబోతోందని, ఇందులో ఏ విధమైన సందేహం లేదన్నారు. ఇది ప్రజలు నిర్ణయిస్తారని, ముఖ్యమంత్రిని ప్రజా కోర్టులో నిలబెడతారన్నారు. చంద్రబాబునాయుడు ధర్మపోరాట దీక్ష చూస్తుంటే ప్రజాస్వామ్యం గాడి తప్పిందని నిరూపిస్తుందన్నారు. బాలకృష్ణ మాటలు రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తి మాట్లాడే మాటల్లా లేవని, మోదీ మాతో పెట్టుకోకు అని అనడం ఎంత వరకు సమంజసమన్నారు. చంద్రబాబునాయుడు వింటుండగానే బాలకృష్ణ తన భాషలో మోదీని అవమానకరంగా మాట్లాడారన్నారు. చంద్రబాబు స్థాయి మరిచి మాట్లాడుతున్నారని పేర్కొంటూ, ఎన్‌ఆర్ ఈజీఎస్, స్వచ్ఛ్భారత్ మరుగుదొడ్ల నిధులు నాకేసే స్థాయి వారిదని ఆరోపించారు. మరుగుదొడ్డి నిధులు నాకేస్తారా అని ఆరోపించారు. రాష్ట్రంలో తెలుగుదేశం పాలన గాడి తప్పిందని, రానున్న ఏడాదిలో రాష్ట్ర పాలనను బీజేపీ గాడిలో పెట్టనుందన్నారు. ప్రధాని పట్ల అక్కసుతోనే ఈ విధంగా సిఎం మాట్లాడుతున్నారన్నారు. ఇది వరకటి బీజేపీ కాదన్నారు. హోదా పట్ల చిత్తశుద్ధి వుంటే పెట్టిన కేసులు ఎందుకు ఎత్తలేదని సోము వీర్రాజు ప్రశ్నించారు. గాడి తప్పిన పాలనలో లయతప్పి ఉద్యమాలు నిర్వహిస్తున్నారన్నారు. సీఎం రాజీనామా చేస్తే తామంతా రాజీనామా చేస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. బాత్‌రూమ్‌లు నాకేసే వారికి చుక్కలు చూపించడం పెద్ద కష్టమా అని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ సోము వీర్రాజు