ఆంధ్రప్రదేశ్‌

సరికొత్త ఆలోచనలతో రెడ్‌క్రాస్ సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 21: సరికొత్త ఆలోచనలతో రెడ్‌క్రాస్ సొసైటీ సేవలు ప్రజలకు అందుబాటులోకి రావాలని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రెడ్‌క్రాస్ సొసైటీ బంగారు పతకాలు, సేవా అవార్డుల ప్రదానోత్సవం విశాఖలో శనివారం జరిగింది. ముఖ్యఅతిధిగా పాల్గొన్న గవర్నర్ మాట్లాడుతూ అవసాన దశలో ఉన్న వృద్ధులకు చేయూతనందించేలా రెడ్‌క్రాస్ సేవా కార్యకలాపాలు విస్తరించాలని ఆకాంక్షించారు. వృద్ధాప్యంలో ఒంటరి తనంతో తీవ్ర నిర్శా నిశ్పృహల మధ్య జీవిస్తున్న వారికి రెడ్‌క్రాస్ సంస్థ బాసటగా నిలవాలన్నారు. కుటుంబీకుల నిర్లక్ష్యంతో ఒంటరితనాన్ని అనుభవిస్తున్న వారిని అక్కున చేర్చుకునేందుకు సీనియర్ సిటిజన్ హోం (వృద్ధాశ్రమాలు)లను రెడ్‌క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించాలన్నారు. రెడ్‌క్రాస్ సంస్థ రక్తనిధి కేంద్రాలకు అనుసంధానంగా ఉంటూ రక్తదాన శిబిరాలను నిర్వహిస్తోందన్నారు. రెడ్‌క్రాస్ సంస్థ రాష్ట్ర చైర్‌పర్సన్ రేచల్ ఛటర్జీ మాట్లాడుతూ సభ్యులందరి కృషితో జాతీయ స్థాయిలో సంస్థ సేవలు అందుతున్నాయన్నారు. మానవత్వ విలువల కోసం పనిచేసే అతిపెద్ద సంస్థగా రెడ్‌క్రాస్ సొసైటీ గుర్తింపు పొందిందన్నారు. మానవత్వమే లక్ష్యంగా రెడ్‌క్రాస్ సేవలందిస్తోందన్నారు. శ్రీకాకుళంలో యోగా కేంద్రాన్ని, కడపలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఈ సంస్థ ద్వారా నడుపుతున్నామని, భవిష్యత్‌లో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ రెడ్‌క్రాస్ సొసైటీ వెబ్‌సైట్‌ను గవర్నర్ నరసింహన్ దంపతులు ప్రారంభించారు. ప్రతి నెలా లేదా పక్షం రోజుల కోసారి తాజా సమాచారాన్ని అందుబాటులో ఉంచాలని గవర్నర్ సూచించారు. సంస్థ చేపడుతున్న కార్యకలాపాలతో పాటు సభ్యులుగా చేరేందుకు ఆసక్తి కనబరిచే వారికోసం వివరాలు పొందుపరచాలన్నారు.
అనంతరం 2015-16, 2016-17 సంవత్సరాలకు గాను ఉత్తమ సేవలందించిన 85 మందికి బంగారు పతకాలు, 11 మందికి సేవా మెమెంటోలు, ఆరుగురికి షీల్డ్‌లు గవర్నర్ నరసింహన్ దంపతుల చేతుల మీదుగా అందజేశారు. అలాగే సభ్యత్వ రుసుం అత్యధికంగా సేకరించిన ఆరు జిల్లా శాఖలకు అవార్డులు అందజేశారు.
శ్రీకాకుళం, కృష్ణా జిల్లాల కలెక్టర్లు ధనుంజయరెడ్డి, లక్ష్మీకాంతం అవార్డులను అందుకోగా, విశాఖ జిల్లా కలెక్టర్ తరపున ఇన్‌ఛార్జి కలెక్టర్ సృజన అవార్డు అందుకున్నారు. సమావేశంలో రెడ్‌క్రాస్ సంస్థ ప్రతినిధులు హరిప్రీత్ సింగ్ , రెడ్‌క్రాస్ సంస్థ ఏపీ ప్రధాన కార్యదర్శి ఎస్ బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
చిత్రం..అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్‌కు అభివాదం చేస్తున్న విశాఖ ఇన్‌చార్జి కలెక్టర్ సృజన