ఆంధ్రప్రదేశ్‌

రాష్టవ్య్రాప్తంగా కేన్సర్ కేర్ ఇన్‌స్టిట్యూట్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 21: రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో కేన్సర్ వ్యాధిని గుర్తించి చికిత్స అందించేందుకు వీలుగా కేన్సర్ కేర్ ఇన్‌స్టిట్యూట్‌లను ఏర్పాటు చేసేందుకు టాటా ట్రస్ట్‌తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. ఉండవల్లిలోని గ్రీవెన్స్ సెల్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో శనివారం ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. తొలిదశలో ఇప్పటికే కేన్సర్ గుర్తింపు కేంద్రాలున్న చిత్తూరు, కర్నూలు, విశాఖ జిల్లాలు మినహాయించి మిగిలిన జిల్లాల్లో ఈ ఇన్‌స్టిట్యూట్‌లను ఏర్పాటు చేస్తారు. రెండోదశలో ఇప్పటికే ఉన్న ఆ మూడు జిల్లాల్లో మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు వీలుగా చర్యలు తీసుకుంటారు. ఎన్టీఆర్ కేన్సర్ కేర్ ట్రస్ట్ ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించనుంది.