ఆంధ్రప్రదేశ్‌

ఇరకాటంలో బీజేపీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ/ గుంటూరు, ఏప్రిల్ 22: దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ నాయకత్వంలో బీజేపీ దూసుకుపోతుంటే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం సమస్యలతో సతమతవౌతోంది. ఒకవైపు ప్రత్యేక హోదా పోరు, మరోవైపు కంభంపాటి హరిబాబు రాజీనామాతో అధ్యక్ష పీఠాన్ని భర్తీ చేయలేని తలపోటుతో కొట్టుమిట్టాడుతోంది. కొంతకాలంగా రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు పదవి రావటం కష్టమేనంటూ మొదటి నుంచి ఆయనకు మద్దతుగా నిలుస్తూ వచ్చిన బీజేపీ రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి రవీంద్రరాజు తెలియజేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇదే సమయంలో అధ్యక్ష పదవి రేసులో సోము వీర్రాజు, దగ్గుబాటి పురంధ్రీశ్వరి ముందువరుసలో నిలిచారు. మొదటి నుంచి ఇటు వీర్రాజు, అటు కన్నాను వ్యతిరేకిస్తూ వస్తున్న ఒక బలీయమైన వర్గం బీసీ వర్గానికి అధ్యక్ష పదవి కట్టబెట్టడం వల్ల ప్రయోజనం చేకూరుతుందనే కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. రాష్ట్రంలో కమ్మ, రెడ్డి, కాపు వర్గాలు ప్రస్తుతం బీజేపీకి అనుకూలంగా వ్యవహరించటం లేదని, కొద్దోగొప్పో మోదీ పట్ల అనుకూల వైఖరితో ఉన్న బీసీ వర్గాలను దరిచేర్చుకోవటం వల్ల వచ్చే ఎన్నికల్లో ఉనికి కాపాడుకోగలమనే వాదన వినిపిస్తున్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న పవన్ కళ్యాణ్ ఆఖరి క్షణాన మద్దతిస్తే కొంతమేర లబ్ధిపొందవచ్చని కూడా వారంటున్నారు. బీజేపీ అధ్యక్ష పదవి ఎలాంటి పరిస్థితుల్లోనూ తనకు దక్కదన్న సమాచారం అందుకున్న కన్నా లక్ష్మీనారాయణ ఆదివారం తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఇదే సమయంలో రాజకీయ భవిష్యత్‌ను కాపాడుకునేందుకు ప్రత్యామ్నాయంగా ఆయన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు గుంటూరులోని కన్నా ఇల్లు అనుయాయులతో కిక్కిరిసిపోయింది. ప్రధానంగా పెదకూరపాడు, గుంటూరు నియోజకవర్గాల నుంచి పెద్దసంఖ్యలో కార్యకర్తలు వచ్చి తక్షణం బీజేపీని వీడి వైకాపాలో చేరాలంటూ ఆయనపై ఒత్తిడి తెచ్చారు. ఇదే సమయంలో విజయవాడ నుంచి కూడా ఆయన అనుచరులు గుంటూరు బయల్దేరి వెళ్లారు. వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంట్ స్థానం, లేదా గతంలో నాలుగుమార్లు గెలిచిన పెదకూరపాడు నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలన్న ఒత్తిడి కూడా పెరుగుతోంది. ఉదయం నుంచి సన్నిహితులు, అనుచరులు తన ఇంటికి వచ్చి వైకాపాలో చేరాలన్న ఒత్తిడి తెస్తున్న మాట వాస్తవమేనని కన్నా ఆంధ్రభూమి ప్రతినిధికి తెలిపారు. సుదీర్ఘకాలంగా తన వెంట నిలుస్తూ వచ్చిన సన్నిహితుల మాటకు విలువ ఇవ్వాలి కదా అని ఆయనన్నారు. ఈ స్థితిలో ఆయన బీజేపీని వీడే పరిస్థితులు స్పష్టమవుతున్నాయి. ఇదే సమయంలో బీజేపీ రాష్ట్ర నాయకులు విజయవాడలో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకుంటున్నారు. కన్నా వెంట మరికొందరు నాయకులు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి కాంగ్రెస్‌లో ఉన్నప్పుడే రాష్ట్ర అధ్యక్ష పదవికి సోనియా గాంధీ కన్నా పేరును సిఫార్స్ చేశారు. రాష్ట్ర విభజనానంతరం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్‌లోనే కొనసాగి గుంటూరు నుంచి పోటీచేసిన ఆయన తొలిసారి ఓటమి పాలయ్యారు. తర్వాత బీజేపీలో చేరి గుంటూరు జిల్లాలో పార్టీ బలోపేతానికి తనవంతుగా కృషి చేస్తున్నారు.