ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం సరికాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఏప్రిల్ 22: కేంద్రం పెద్దన్నగా వ్యవహరించాలే తప్ప రాష్ట్రాలపై పెత్తనం చేయడం సరికాదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఆదివారం గుంటూరు వచ్చిన ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ దేశ ఆర్థికాభివృద్ధిలో బ్యాంకుల పాత్ర కీలకమని, అయితే నోట్ల రద్దు తర్వాత దేశ వృద్ధిరేటు 8శాతం నుండి 6.5 శాతానికి పడిపోయిందన్నారు. ఇందుకు రియల్ ఎస్టేట్ రంగం నిస్తేజంగా మారటం కూడా ఒక కారణమన్నారు. బ్యాంకుల్లో రుణాలు తీసుకుని తిరిగి చెల్లించకుండా వీసాలతో విదేశాలకు వెళ్తున్న వారిని కేంద్రం దేశానికి రప్పించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. నోట్ల రద్దు తర్వాత బ్లాక్‌మనీ అంతా వైట్‌మనీ అయ్యిందే తప్ప కేంద్రం ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదన్నారు. జీఎస్టీ అమలుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాయని, అయితే లోపాలున్నప్పటికీ వాటిని సవరించకపోవడం సరికాదన్నారు. యూరప్, న్యూజిలాండ్ మాదిరిగా జీఎస్టీని అమలుచేయాల్సి ఉందని, అయితే కేంద్రం తనకు అనుకూలంగా చట్టంలో మార్పులు చేర్పులు చేసిందన్నారు. రాజ్యాంగపరంగా అనేక అంశాలను కేంద్రం అమలు చేయకుండా గండికొడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇవ్వాలే తప్ప తామే అన్నింటికీ మూలం అన్నట్లు వ్యవహరించడం సరికాదన్నారు. రాష్ట్రాలు ఆర్థికంగా పరిపుష్టి సాధిస్తేనే కేంద్రం బలోపేతం అవుతుందన్నారు. అమెరికాలో కూడా రాష్ట్రాలకు ఎన్నో హక్కులు ఉన్నాయన్నారు. త్వరలో అమరావతిలో వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సమావేశం నిర్వహించనున్నట్లు యనమల వెల్లడించారు. విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి, అర్బన్ బ్యాంకు చైర్మన్ బోనబోయిన శ్రీనివాస యాదవ్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాయపాటి రంగారావు, తదితరులు పాల్గొన్నారు.