ఆంధ్రప్రదేశ్‌

టీటీడీ పాలకవర్గాన్ని రద్దు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మడకశిర, ఏప్రిల్ 22 : రెండు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలక వర్గాన్ని వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా మడకశిరలో రఘువీరా ఆదివారం విలేఖరులతో మాట్లాడుతూ టీటీడీ పాలకవర్గాన్ని గత ఒకటిన్నర ఏడాదిగా నియమించకుండా నిర్లక్ష్యం చేసి ప్రస్తుతం హిందూ మతాన్ని కించపరిచే విధంగా నియమించారని ఆరోపించారు. దీనికి తోడు నియమించిన పాలకవర్గం కూడా రాజకీయాల కోసమే తప్ప దైవభక్తి పెంపు, హిందూ సంప్రదాయాలను పటిష్ట పరిచే విధంగా లేదన్నారు. పాలకవర్గంలో నియామకం పొందిన వ్యక్తుల వెంట బైబిల్ ఉంటుందని, వారే స్వయంగా చెబుతున్నా అలాంటి వారిని పాలకవర్గంలో నియమించి అవమాన పరిచారన్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పాలకవర్గ నియామకం జరగలేదన్నారు. అన్యమతస్థులు పాలకవర్గంలో సభ్యులుగా కొనసాగేందుకు అర్హత లేదన్నారు. పాలకవర్గంలో నియమించే వ్యక్తుల గుణగణాలు తదితర అంశాలపై పోలీసు, రెవెన్యూ, తదితర శాఖలతో విచారణ నిర్వహించి నియమిస్తారని, అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అలాంటివి ఏమీ చేయకుండానే టీటీడీ పాలకవర్గాన్ని నియమించి తప్పు చేశారన్నారు. వెంటనే సీఎం ప్రజలకు క్షమాపణలు చెప్పాలని రఘువీరా డిమాండ్ చేశారు. ఇతర మతాలకు చెందిన ప్రార్థనా మందిరాలను సందర్శించి పూజలు చేయవచ్చునని, అయితే మత మార్పిడిలు చేసిన వారినే పాలకవర్గంలో నియమించడం న్యాయం కాదన్నారు. రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు బీజేపీతో కలిసి కాపురం చేసేందుకు ఇంకా ఇష్ట పడుతూనే ఉన్నాయన్నారు. ఇందులో భాగంగానే మహారాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి సతీమణికి టీటీడీ పాలకవర్గంలో అవకాశం కల్పించారన్నారు. ఇలాంటి పాలకవర్గాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రఘువీరాతో పాటు డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యం, మాజీ ఎమ్మెల్యే సుధాకర్ ఉన్నారు.